లాక్ డౌన్లోని సడలింపులలో భాగంగా ..ప్రభత్వాలు షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చేసారు.ఇటు సీరియల్స్,అటు సినిమాలు చిత్రీకరణకు సిద్ధమవుతున్నాయి… లాక్డౌన్ తరువాత టాలీవుడ్ లో తొలి షూటింగ్ జరుపుకుంటున్న దర్శకుడు,నటుడు ‘రవి బాబు’ క్రష్ సినిమా..నిన్న పునప్రారంభించారు.హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు.దీనికి సంబంధించి ప్రేక్షకుల కోసం ఒక వీడియోని విడుదల చేసారు.

ప్రభుత్వాల నియమాలను ని పాటిస్తూ అటు మేకప్ మేన్స్ ,ఇటు నటి నటులు…తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టెక్నీషన్స్ కి, ఆర్టిస్టులకి ఎలాంటి వైరస్ సోకినా దానికి చిత్ర దర్శక నిర్మాతలదే బాధ్యత అంటూ..ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అందరికి తెలిసిందే.అటు రాజమౌళి RRR ,చిరంజీవి ఆచార్య కూడా షూటింగ్స్ కి ముస్తాబు అవుతున్నాయి..ఇతర అగ్ర హీరోల షూటింగ్స్ ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు కనుపడట్లేదు.మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ చిత్రీకరణకు వెళ్ళవలసి ఉండగా.

మహేష్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.ప్రభాస్. ‘జాన్’ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఆగస్టులో చిత్రీకరణ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి థియేటర్స్ కి ఇంకా అనుమతి లభించ నందున పలువురు నిర్మాతలు OTT బాట పడుతున్నారు.అనుష్క నిశ్శబ్దం,నాని V, రామ్ ‘రెడ్’ ,వైష్ణవ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.