ప్చ్..ఎంత పని చేశావమ్మా..శ్రీయ..రాజమౌళి కి కోపం తెప్పించేసావు గా.?

ప్చ్..ఎంత పని చేశావమ్మా..శ్రీయ..రాజమౌళి కి కోపం తెప్పించేసావు గా.?

by Anudeep

Ads

కొందరు తారలు ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాం అని అంటే చాలు..వాళ్ళ ఎక్సయిట్మెంట్ అంత ఇంత ఉండదు..ఒక్కోసారి వాళ్ళు ఏమి చేస్తుంటారో…ఏమి చెప్పేస్తుంటారో వారికే తెలియదు ఏమో..బహుశా..దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఆర్టిస్టుల పొరపాటు వలన సినిమా కి సంబంధించి సీక్రెట్స్ బయటకి వెళుతూ ఉంటాయి…ఇలాంటి ఒక పొరపాటే జరిగిపోయింది జక్కన్న సినిమాకి.

Video Advertisement

కంటెంట్ పరంగా..సినిమా లోని ఆర్టిస్టుల లుక్ ల పరంగా..సాధ్యమైనంతవరకు అన్ని గోప్యాంగనే ఉంచుతారు రాజమౌళి…RRR సినిమా కి సంబంధించి ఒక ముఖ్య పాత్ర కోసం..హీరోయిన్ శ్రీయ ని తీసుకున్నారట…అంతే కాదు ఈ విషయాన్నిఎక్కడ కూడా బయటకు వెళ్లనివ్వద్దు అని చేప్పేశారట..ప్రాజెక్ట్ కి సైన్ చేసే అప్పుడే..కానీ ఇటీవలే ఈ విషయాన్ని లీక్ చేసేసారు శ్రీయ.

దీనితో విషయం కాస్త జక్కన వరకు వెళ్లడంతో రాజమౌళి సీరియస్ అయ్యారనే వార్త వైరల్ అవుతుంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కథనం ప్రకారం సినిమాలో శ్రీయ పాత్ర ఏంటి అంటే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన నటించేందుకు తీసుకున్నారని. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో శ్రీయ కనిపించబోతున్నారనే ఒక వార్త అయితే బాగా చక్కర్లు కొడుతుంది..మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో సినిమా విడుదల అయ్యే వరకు తెలియదు..

 


End of Article

You may also like