Ads
కళాతపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాలు ఆణిముత్యాలు. ఎంతో మందికి ఆయన సినిమాలో ఒక టెక్స్ట్ బుక్ లాగా నిలిచాయి. సినిమాలు ఎలా తీయాలి అనేదానికి ఆయన ఒక నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ఆయన సినిమాల రూపంలో ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతారు. ఆయన తీసిన సినిమాల్లో ఒక ఆణిముత్యంగా పరిగణించే సినిమా శుభసంకల్పం. ఈ సినిమాలో విశ్వనాథ్ గారు నటించారు కూడా. కమల్ హాసన్, ఆమని, గొల్లపూడి మారుతీ రావు గారు, సాక్షి రంగారావు గారు, నిర్మలమ్మ గారు ముఖ్య పాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి గారు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఉత్తమ నటి విభాగంలో ఆమనికి, ఉత్తమ సహాయ నటి విభాగంలో వైష్ణవి అరవింద్ కి, ఉత్తమ క్యారెక్టర్ విభాగంలో విశ్వనాథ్ గారికి, ఉత్తమ ప్లే బ్యాక్ సింగింగ్ విభాగంలో ఎస్పీ శైలజ గారికి, ఉత్తమ ఎడిటర్ విభాగంలో జి జి కృష్ణారావు గారికి నంది అవార్డ్స్ లభించాయి. ఈ సినిమాని నిర్మించినందుకు, ఉత్తమ చిత్రం విభాగంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో కె విశ్వనాథ్ గారికి, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో కీరవాణి గారికి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లభించాయి. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు ప్రియా రామన్. సంధ్య అనే పాత్రలో ప్రియా రామన్ నటించారు. ప్రియా రామన్ తెలుగులో నటించినవి కొన్ని సినిమాలు మాత్రమే. కానీ ఎంతో గుర్తింపు పొందారు. 1993 లో వల్లి అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అర్జున్ హీరోగా నటించిన మా ఊరి మారాజు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. సూర్యవంశం అనే తెలుగు సీరియల్ లో కూడా ప్రియా రామన్ నటించారు. పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ప్రస్తుతం ప్రియా రామన్ తమిళ్ సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఒక షో కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రియా రామన్ 1999 లో రంజిత్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు. 2014 లో వాళ్ళిద్దరూ విడిపోయారు. వీరికి ఆదిత్య రావు, ఆకాష్ రావు అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రియా రామన్ తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలి అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.
End of Article