శ్యామ్ సింఘ రాయ్ “ఫస్ట్ రివ్యూ”..! సెన్సార్ టాక్ ఏంటంటే..?

శ్యామ్ సింఘ రాయ్ “ఫస్ట్ రివ్యూ”..! సెన్సార్ టాక్ ఏంటంటే..?

by Mohana Priya

Ads

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నానితో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.

Video Advertisement

టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని శ్యామ్ సింగ రాయ్ గా, వాసుగా రెండు పాత్రల్లో నటించారు.

shyam singha roy censor talk

ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే టాక్ కూడా వచ్చేసింది. శ్యామ్ సింఘ రాయ్ లెంగ్త్ దాదాపు 2 గంటల 38 నిమిషాలు ఉందట. అంత నిడివి ఉన్నా కూడా కథ చాలా ఆసక్తిగా ఉంది. దర్శకుడు అవ్వాలనుకున్న వాసుకి అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల తన గత జన్మ గుర్తుకు రావడం అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది అని సమాచారం.

shyam singha roy censor talk

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా సేపు ఉంటుందని సమాచారం. ఇందులో నాని నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయిందని, నటుడిగా నానికి ఇది ఇంకా ముందు తీసుకెళ్ళే సినిమా అవుతుంది అని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో సంవత్సరాల క్రితం శ్యామ్ సింఘ రాయ్ అనే ఒక రచయిత సంఘంలో జరిగే దేవదాసి సంస్కృతిపై ఎలా పోరాడాడు అనే విషయం చుట్టూ ఫ్లాష్ బ్యాక్ తిరుగుతుంది. సినిమాకి ఫ్లాష్‌బ్యాక్ ఒక ముఖ్య హైలైట్‌గా నిలిచింది. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోయినా కూడా కథ చాలా బలంగా ఉందట. ఒక వేళ ఇదే టాక్ విడుదలయ్యాక వస్తే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని ఓవరాల్ రివ్యూ ఇచ్చారు.


End of Article

You may also like