Shyam Singha Roy Review : ఈసారైనా “నాని” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Shyam Singha Roy Review : ఈసారైనా “నాని” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : శ్యామ్ సింగ రాయ్
  • నటీనటులు : నాని, సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్.
  • నిర్మాత : వెంకట్ బోయినపల్లి
  • దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాన్
  • సంగీతం : మిక్కీ జె మేయర్
  • విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021

shyam singha roy review

Video Advertisement

స్టోరీ :

వాసుదేవ్ (నాని) ఒక డైరెక్టర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. కీర్తి (క్రితి శెట్టి) తో ఒక షార్ట్ ఫిలిం చేస్తాడు. ఇది సక్సెస్ అవడంతో తర్వాత వాసుకి ఒక ఫీచర్ ఫిలిం చేసే అవకాశం వస్తుంది. ఆ సినిమా కూడా హిట్ అవడంతో వాసు ఇంక హాట్ టాపిక్ గా మారుతాడు. కొన్ని కారణాల వల్ల పోలీసులు వాసుని అరెస్ట్ చేస్తారు. అందుకు కారణం, వాసుకి తెలిసీ తెలియకుండా తన కథలు 1970లో ఉన్న శ్యామ్ సింగ రాయ్ అనే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినవి అయ్యి ఉంటాయి. అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ అనే వ్యక్తిపై వాసు ఎందుకు కథలు రాశాడు? వాసుకి, శ్యామ్ సింగ రాయ్ కి ఏం సంబంధం ఉంది? రోజీ (సాయి పల్లవి), శ్యామ్ సింగ రాయ్ కథేంటి? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

shyam singha roy review

రివ్యూ :

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదలైన నాని సినిమా ఇదే. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ఇది ఒక డిఫరెంట్ సినిమా అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. సినిమా 2 నేపథ్యాల్లో నడుస్తుంది. ఒకటి ప్రస్తుతం జరిగే టైం పీరియడ్ లో అయితే, మరొకటి చాలా సంవత్సరాల క్రితం కోల్‌కతాలో జరిగిన కథ. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్, అలాగే అసలు కథ ఎక్కువగా ఉండేది మాత్రం శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్‌లోనే. ఈ ఎపిసోడ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి.

shyam singha roy review

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, నానికి మళ్లీ జెర్సీ తర్వాత శ్యామ్ సింగ రాయ్ లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్‌కి అస్కారం ఉన్న పాత్ర దొరికింది. వాసు లాంటి పాత్ర అంతకముందు నాని చాలా సార్లు చేసారు. కానీ శ్యామ్ సింగ రాయ్ గా మాత్రమే చాలా బాగా చేసారు. క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ తమ పాత్రల వరకు బాగా చేసారు. నాని తర్వాత సినిమాకి అంత హైలైట్‌గా నిలిచిన నటన మాత్రం సాయి పల్లవిదే. నటన, డ్యాన్స్ అన్నీ చాలా బాగా చేసారు.

shyam singha roy review

రాహుల్ సాంకృత్యాన్ రాసుకున్న కథ బాగుంది. కానీ, కొన్ని సీన్స్ మాత్రం అసలు అనవసరం ఏమో అనిపిస్తాయి. చాలా మంది సినిమా చూసేది శ్యామ్ పాత్ర కోసమే. దాంతో వాసు, కీర్తి మధ్య వచ్చే సీన్స్, అలాగే ఆ ఎపిసోడ్ లో ట్రై చేసిన కామెడీ అదంతా పెద్దగా ఇంప్రెస్ చెయ్యదు. అలాగే నాని, క్రితి శెట్టి పెయిర్ కూడా అంత బాగా అనిపించదు. సాను జాన్ వర్గీస్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో అయితే అసలు ఆ టైంలో కోల్‌కతాలో ఉన్నట్టే ఉంటుంది. అంత బాగా చూపించారు. అలాగే కోల్‌కతా సెట్ అనే విషయం గుర్తుకి కూడా రాకుండా నిజంగా కోల్‌కతాని చూపించినట్టే అనిపిస్తుంది.  కాస్ట్యూమ్స్, పాత్రల గెటప్స్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నాని, సాయి పల్లవి
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్
  • ఫ్లాష్‌బ్యాక్‌లో అందించిన మెసేజ్

మైనస్ పాయింట్స్:

  • వాసు, కీర్తి సీన్స్
  • అక్కడక్కడా వర్కౌట్ అవ్వని కామెడీ

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరమైన సీన్స్ మినహాయిస్తే, శ్యామ్ సింగ రాయ్ ఒక మంచి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా. టీజర్, పాటలు, ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకున్న ప్రేక్షకుడిని మాత్రం డిసప్పాయింట్ చెయ్యదు.


End of Article

You may also like