“శ్యామ్ సింగ రాయ్” డిలీటెడ్ సీన్.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంత బాగున్న సీన్ ని ఎందుకు డిలీట్ చేశారో..?

“శ్యామ్ సింగ రాయ్” డిలీటెడ్ సీన్.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంత బాగున్న సీన్ ని ఎందుకు డిలీట్ చేశారో..?

by Anudeep

Ads

హీరో నాని వరుస సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకి నాని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది.

Video Advertisement

నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌ గా ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

shyam singha roy review

తెలుగు లో మాత్రమే కాకుండా త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో కూడా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఇటీవల ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యి ప్రేక్షకుల మన్ననను పొందుతోంది. అయితే.. థియేటర్ లో విడుదల అయిన వెర్షన్ లో లేని సీన్స్ కూడా ఓటిటిలో కనిపిస్తున్నాయి.

shyam singha roy review

తాజాగా ఈ సినిమానుంచి ఓ డిలీటెడ్ సీన్ వైరల్ అవుతోంది. ఈ సీన్ ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సీన్ లో శ్యామ్ సింగ రాయ్ వేశ్యల గురించి తాను రాసిన ఓ లేఖని చదివి వినిపిస్తూ ఉంటాడు. ఇదంతా విన్నాక, వారిలో ఓ వేశ్య ఇంత తెలిసిన వ్యక్తివి నువ్వు.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా..?” అని అడుగుతుంది.

shyam singha roy review

దానికి, నాని “కచ్చితంగా చేసుకుంటాను. నిన్ను ప్రేమించిన రోజున..” అని సమాధానం చెబుతాడు. ఈ సీన్ నిజంగా చాలా బాగుంది. కానీ.. ఈ సీన్ ని సినిమా నుంచి ఎందుకు తీసేసారు అన్న సంగతి తెలియదు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై‌ విడుదల అయిన ఈ సినిమాపై విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.

Watch Video:

 


End of Article

You may also like