Ads
హీరో సిద్ధార్థ్, ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఇమేజ్, ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాల ద్వారా అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారారు.
Video Advertisement
సిద్ధార్థ హీరోగా చాలా అద్భుతమైన లవ్ స్టోరిచిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆ తరువాత కొన్నేళ్ళ పాటు టాలీవుడ్ కు దూరం అయ్యారు. చాలా గ్యాప్ తరువాత 2021 లో ‘మహాసముద్రం’ అనే మూవీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ని పలకరించారు. కానీ ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్లాప్ పై సిద్ధార్థ్ స్పందించారు.టాలీవుడ్ చిత్రాలలో నటించి హీరోగా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2021 లో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ మూవీ పై సిద్ధార్థ్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడాడు. మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో కానీ ఆమూవీ ఆశించినట్లుగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ప్లాప్ అవడం పై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ‘మహా సముద్రం’ నా ఫేవరెట్ సినిమా. కానీ ఆ మూవీ జనాలకి కనెక్ట్ కాలేదు. హీరో ఫ్రెండ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం ఆడియెన్స్ కి నచ్చలేదు, అందువల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలా అని ఈ చిత్రం చెడ్డ మూవీ కాదు. దర్శకుడు అజయ్ భూపతితో వర్క్ చేయడానికి ఇప్పటికీ నేను రెడీగా ఉన్నాను.
అతను గ్రేట్ టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100 మూవీని మించిన చిత్రాలు అజయ్ నుండి చాలా వస్తాయని అన్నారు. కొంతమంది నాతో ఈ మూవీ మరో 10 సంవత్సరాల తరవాత రావాల్సింది అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదని చెప్పుకొచ్చారు.
End of Article