Ads
సిద్ధార్థ్ హీరోగా నటించిన టక్కర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళ్ లో రూపొందింది. కానీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి రిలీజ్ అయిన రోజు నుండి ఫ్లాప్ టాక్ వచ్చింది. కథలో,, స్క్రీన్ ప్లే లో ఎక్కడ ఒక్క చోట కూడా కొత్తదనం లేదు అన్నారు.
Video Advertisement
మహాసముద్రం సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ కి ఈ సినిమాతో అయినా హిట్ దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం బాగానే రాబట్టింది అని సమాచారం.
అది ఎలాగంటే, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ చాలా ఎక్కువగా మొత్తానికి అమ్ముడుపోయాయి అని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి 15 కోట్లు కి అమ్మారు అని సమాచారం. దాంతో ఒక రకంగా ఈ సినిమాకి కొంచెం డబ్బులు కలిసి వచ్చాయి. సిద్ధార్థ్ కి కొన్ని సంవత్సరాల నుండి మంచి హిట్ సినిమాలు లేవు.
తెలుగులో అయితే చాలా సంవత్సరాల తర్వాత చేసిన మహాసముద్రం సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి మొత్తానికి రైట్స్ అమ్ముడుపోవడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకొని ఉంటే సిద్ధార్థ్ కం బ్యాక్ ఇచ్చేవారు. అయినా కూడా సిద్ధార్థ్ ఎప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ గురించి ఆలోచించలేదు.
కేవలం కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలని, అలాగే తనకి డిఫరెంట్ సబ్జెక్ట్ అనిపించిన సినిమాలని మాత్రమే చేస్తూ ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, సిద్ధార్థ్ వెబ్ సిరీస్ కూడా చేశారు. అందులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరి సిద్ధార్థ్ నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అందులో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
End of Article