అర్జున్ రెడ్డి సినిమాని ఎన్నో సార్లు చూసి ఉంటారు ! కానీ ఈ తప్పులని ఎప్పుడు గమనించి ఉండరు !

అర్జున్ రెడ్డి సినిమాని ఎన్నో సార్లు చూసి ఉంటారు ! కానీ ఈ తప్పులని ఎప్పుడు గమనించి ఉండరు !

by Mohana Priya

Ads

ఎంతో క్రేజ్ సాధించిన సినిమా, కథ నచ్చడంతో అనేక భాషల్లో కూడా రీమేక్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి ప్రీతిగా తొలి పరిచయం అయిన శాలిని పాండే కి కూడా మంచి పేరు వచ్చింది. ఎక్కడ చూసినా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అంటూ, ఆ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని తిరుగుతున్నారు.

Video Advertisement

Also Read:   కొత్త బంగారులోకం హీరోయిన్ కొత్త రూపం….మరీ ఇంతలా మారిపోయిందేంటి…అంటున్న నెటిజన్స్

 

దాని తర్వాత విజయ్ దేవరకొండ పై అభిమానులకి కొండంత ఆశలు పెరిగి పోయాయి. ఈ క్యారెక్టర్ కి విజయ్ సరిగ్గా సెట్ అయ్యాడు. అసలు మామూలుగా కాదు అదరగొట్టేశాడు అని పొగడ్తలతో ముంచెత్తారు. కొందరు ఈ సినిమాని ముద్దుల సినిమా అంటే… మరి కొందరు మాత్రం అది ఒక లవ్ స్టోరీ, ప్రీతి అర్జున్ రెడ్డీల లవ్ స్టొరీ, ఇది అర్థం కానీ వాళ్ళు ముద్దులు, హగ్గులు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు అని కడిగేసారు.

సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ కు మంచి క్రేజ్ వచ్చినప్పటికీ, అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన తప్పులను ప్రేక్షకులు తవ్వి తీశారు. కాగా ఈ తప్పులతో సినిమాపై అంతగా ప్రభావం పడలేదు కానీ, కొందరు ప్రేక్షకులకు మాత్రం ఇంత హిట్ ఇచ్చి కూడా అలాంటి చిన్న

చిన్న సిల్లీ తప్పులు ఎలా చేస్తారు అని అంటున్నారు. ఈ రేంజిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న తప్పులను గమనించారా?? అంటూ వీడియోలు తీసి అందరి కళ్ళు తెరిపించామాని అనుకుంటున్నారు. దీంతో అవి చూసిన నెటిజన్లు ఇంత చేసి ఆ తప్పులను డైరెక్టర్ పట్టించుకోలేదా అంటూ కామెంట్స్ చేశారు.

అయితే సినిమా మొదట్లో, కాలేజీలో ఫుట్ బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు, హీరో గోల్ కీపర్ గా ఉంటాడు. మామూలుగా టీమ్ లోని గోల్ కీపర్ డ్రెస్, టీమ్ మెంబర్స్ డ్రెస్ వేరేలా ఉంటాయి. కానీ ఇందులో హీరో డ్రెస్ కూడా సేమ్ ఉంటుంది ఇదే సినిమాలో జరిగిన మొదటి మిస్టేక్.

ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా తప్పులని వెలికి తీశారు నెటిజన్లు. వీటిపై ప్రత్యేక వీడియోల రూపంలో తప్పులని ఎత్తి చూపించారు. ఆ తప్పులు ఏంటో చూస్తే మీకు కూడా అర్థం అయిపోతుంది అంటున్నారు.

 

Also Read:  ఈ సంవత్సరం లోనే సినిమాని విడుదల చేయొచ్చు కదా ప్రశాంత్ నీల్ మావా ! అంటూ ట్రెండ్ అవుతున్న15 మీమ్స్ !


End of Article

You may also like