“సింహాద్రి” Vs “ఖుషి”..! రీ-రిలీజ్ “విన్నర్” ఏదంటే..?

“సింహాద్రి” Vs “ఖుషి”..! రీ-రిలీజ్ “విన్నర్” ఏదంటే..?

by kavitha

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ మరే ఇండస్ట్రీలోనూ లేదు.అదే గతంలో వచ్చిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం. కొత్త చిత్రాల విడుదల అయినప్పుడు చేయని విధంగా అభిమానులు రీ రిలీజ్ సినిమాలకు హంగామా చేస్తున్నారు.

Video Advertisement

తాజాగా సింహాద్రి మూవీ రిరీలీజ్ అయ్యింది. ఇప్పటివరకు రీరిలీజ్ అయిన చిత్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి వసూళ్లలో టాప్ గా నిలిచింది. సింహాద్రి కలెక్షన్స్ ఖుషి కలెక్షన్స్ ను బీట్ చేసిందా? మరి ఈ 2 సినిమాలలో ఏ చిత్రం ఎక్కువ వసూళ్లు చేసిందో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల చిత్రాలను రీరిలీజ్ చేయడం టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. కొత్త చిత్రాల వసూళ్ల సంగతి ఏమో కానీ, రీరిలీజ్ చిత్రాల కలెక్షన్స్ లో మా హీరో టాప్ అంటే, మా హీరోనే తోపు అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రీ రిలీజ్ వసూళ్ల గురించి కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్, నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని టాగ్స్ ని ఇద్దరి ఫ్యాన్స్ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ రికార్డుల లెక్కలతో ఫ్యాన్స్  కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని ‘4కె’ వెర్షన్‌లో 1200 పైగా స్క్రీన్స్‌లలో విడుదల చేశారు. దీని కోసం హీరో విశ్వక్ సేన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. సింహాద్రి సినిమా మొదటి రోజు వరల్డ్‌ వైడ్‌గా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు.గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ‘ఖుషి’ మొదటి రోజు నాలుగు కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. తాజాగా ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఈ లెక్కలో తేడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి  అభిమానులు గట్టిగా వాదించుకుంటున్నారు.

Also Read: NTR 30 “దేవర” ఫస్ట్‌లుక్‌లో ఈ ఒక్కటే మైనస్ అయ్యిందా..?

 


You may also like