Ads
ఒక సినిమాలో డైలాగ్స్ ఎంత ముఖ్యమో డైలాగ్ డెలివరీ కూడా అంతే ముఖ్యం. డైలాగ్ డెలివరీ ఎంత బాగా వస్తే ఆ డైలాగ్ ఇంపాక్ట్ అంత బాగుంటుంది. సాధారణంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు స్క్రీన్ పై డైలాగ్స్ బాగా రావడానికి డబ్బింగ్ ని ఎంచుకుంటారు. తెర వెనుక ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇచ్చిన వాయిస్ తెరపై ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోస్తుంది.
Video Advertisement
అలా ఎంతో మంది హీరోయిన్లకి డబ్బింగ్ ఇచ్చారు లిప్సిక. లిప్సిక గాయనిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. అందులో లో ఎక్స్ ప్రెస్ రాజా, ప్రేమ కథా చిత్రం, టెంపర్, లవర్స్, నర్తనశాల, సినిమా చూపిస్త మామ, పూలరంగడు, ఛలో సినిమాల్లో లిప్సిక పాడిన పాటలు తనకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చాయి.
లిప్సిక మంచి గాయనితో పాటు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కుమారి 21 ఎఫ్ సినిమాలో హెబ్బా పటేల్ కి డబ్బింగ్ చెప్పారు లిప్సిక. ఆ తర్వాత హెబ్బా పటేల్ నటించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు, మిస్టర్ సినిమాల్లో కూడా హెబ్బా పటేల్ కి డబ్బింగ్ చెప్పారు లిప్సిక.
అలాగే మెహరీన్ కి కూడా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జవాన్, మహానుభావుడు, కవచం సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. వీళ్ళకి మాత్రమే కాకుండా సాహో లో శ్రద్ధ కపూర్ తో పాటు ఇంకా ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు లిప్సిక. లిప్సిక కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా అంబికా దర్బార్ బత్తి, తెనాలి డబల్ హార్స్ మినప గుళ్ళు తో పాటు ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కి కూడా డబ్బింగ్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో కొన్ని ఇవే.
అంబికా దర్బార్ బత్తి
తెనాలి డబల్ హార్స్ మినప గుళ్ళు
also watch:
End of Article