Ads
గత రెండు రోజుల క్రితం సింగర్ హరిణి మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాపులర్ సింగర్ హరిణి కుటుంబం కొంతకాలం క్రితమే హైదరాబాద్ నుంచి బెంగళూరు కు షిఫ్ట్ అయ్యింది. అయితే.. ఆమె కుటుంబం మిస్ అయ్యింది అన్న వార్త అభిమానుల్లో కంగారుని రేకెత్తించింది.
Video Advertisement
ఈ విషయమై ఎస్ ఆర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయింది. హరిణి, తల్లిదండ్రులు ఏకే రావు, గిరిజా రావు తో పాటు ఆమె కుటుంబం మిస్ అవ్వడంతో ఈ కేసు నమోదు అయ్యింది. వీరు ఏమయ్యారు అన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. బెంగళూరు రైల్వే స్టేషన్ వద్ద హరిణి తండ్రి ఏ.కె రావు మృతదేహం లభ్యమైంది.
ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా కధనాలు వెలువడ్డాయి. అయితే.. కొందరు పొరపాటున హరిణి రావు ఫోటోలకు బదులు మరొక సింగర్ హరిణి ఫోటోలను పెట్టి ఈ వార్తను ప్రచురించారు.
దీనిపై సింగర్ హరిణి స్పందించారు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియో ను ఆమె పంచుకున్నారు. ఇందులో హరిణి రావు ఫోటోకి బదులుగా తన ఫోటో ఉండడంపై ఆమె స్పందించారు. “ఇది నాకు, నా తల్లితండ్రులకు షాకింగ్ వార్త. జరిగిన దుర్ఘటనకు హరిణి రావు మరియు ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నా.. మీడియా మిత్రులను ఈ వార్త ప్రచురించే ముందు చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నా.. ఎందుకంటే చాలా మంది నా పేరుని, నా ఫోటోను ఉపయోగించి వార్తలను ప్రచురిస్తున్నారు. నాతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఈ వార్తను ప్రచురించారు. మీడియాలో ప్రచురించే వార్తలను అందరూ విశ్వసిస్తారు..” అంటూ ట్విట్టర్ మాధ్యమం గా పేర్కొన్నారు.
— Harini (@harinitipu) November 26, 2021
End of Article