Ads
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాటలు పాడి, ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ కల్పన. కల్పన అనంగానే మనందరికీ మొట్టమొదట గుర్తొచ్చే పాట ఖడ్గం సినిమాలోని ముసుగు వెయ్యొద్దు మనసు మీద. ఈ పాట క్రేజ్ ఇప్పటికి కూడా తగ్గలేదు అంటే దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్, కల్పన వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయో మనమే అర్థం చేసుకోవాలి.
Video Advertisement
అలాగే వెంకీ సినిమాలోని గోంగూర తోట కాడ సాంగ్ కూడా కల్పనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో హిట్ పాటలను పాడారు కల్పన. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగులో కూడా కంటెస్టెంట్ గా వచ్చారు. ఆ తర్వాత నుండి ఎన్నో స్టేజ్ షోస్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కల్పన. అలాగే సింగింగ్ రియాల్టీ షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరించారు.
అయితే కల్పన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలని పంచుకున్నారు. కల్పన కొన్ని సినిమాల్లో నటించారు. కల్పనకి నటన అంటే ఆసక్తి ఉన్నా కూడా అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువగా నచ్చకపోవడంతో నటనని వదిలేశారు. అలాగే డబ్బింగ్ చెప్పడం కూడా కష్టంగా అనిపించడంతో సింగింగ్ నయం అని అనుకున్నారట.
కల్పనకి రికార్డింగ్ కంటే లైవ్ గా పాడడం అంటేనే ఇష్టమట. కల్పన తొలి గురువు తన నాన్న గారు. ఆ తర్వాత శ్రీనివాసన్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 2010 లో కల్పన అన్ని పోగొట్టుకున్నారట. అప్పుడు చనిపోవాలి అని అనుకున్నారట. కానీ సింగర్ చిత్ర గారు ఒక మలయాళం షోలో పాల్గొనమని అవకాశం ఇచ్చారు.
అందులో కంటెస్టెంట్ గా పాల్గొనటంతో ఇండస్ట్రీ పరువు పోయింది అని కొంత మంది కల్పనని అవమానించారట. తర్వాత షోలో కల్పన విన్నర్ గా నిలిచారు. దాంతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందింది అని కల్పన చెప్పారు. కల్పన ప్రస్తుతం స్వరాభిషేకం వంటి షోస్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాగే ఎన్నో సినిమాల్లో పాటలు కూడా పాడుతున్నారు.
End of Article