సింగర్ కనికా కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందే వార్తలు వస్తున్నాయి . ఇప్పటికే గత పదిహేను రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కనికకి వరుసగా నాలుగోసారి చేసిన పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో కనికా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాలేకపోతోందా లేదంటే ట్రీట్మెంట్ మరింత మెరుగు పర్చాల్సి అవసరం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కనికా ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న ఈ నేపద్యంలో ఇన్స్టాలో కనిక పెట్టిన ఒక పోస్టు ఆసక్తికరంగా మారింది .

విదేశాల నుండి వచ్చి విదిగా వైధ్యపరీక్షలకు హాజరు కావాలని చెప్తున్నప్పటికి , ఆ మాటలను పెడచెవిన పెట్టి బర్త్ డే ఫంక్షన్ కి హాజరు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . లండన్ నుండి నేరుగా లక్నో కి చేరుకుని అక్కడ మాజీ సిఎం వసుందర రాజే కొడుకు ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కి హాజరయింది. ఆ ఫంక్షన్ కి సుమారు 400 మంది హాజరయ్యారు . తనతో పాటు ఇప్పుడు ఆ 400మందిని, వారు నేరుగా కాంటాక్ట్ అయిన మరెంతో మందిని ప్రమాదంలో నెట్టేసింది.  ఈ విషయంపై లక్నో పోలీసులు కనికాపై కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత కనికని నిర్బందించి సంజయ్ గాంది పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉంచి వైధ్యసేవలందిస్తున్న కొంతమందిలో నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే , కాని కనిక కపూర్ విషయంలో నాలుగోసారి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో తనని విదేశాలకి తీస్కెళ్లి వైధ్యసదుపాయం అందించే అవకాశం కూడా లేదని వాపోతున్నారు.

ఇదిలా ఉండగా కనిక కపూర్ తన ఇన్స్టా అకౌంట్లో ఒక కోట్ పోస్టు చేస్తూ,దానికి తన వ్యాఖ్యలను జోడించింది.అవేంటంటే “లైఫ్ టీచెస్ టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ టైమ్, వైల్ టైమ్ టీచెస్ అజ్ ది వాల్యూ ఆఫ్ లైఫ్” జీవితము కాలం విలువను తెలియచెప్తుంటే,  కాలం మన జీవితం విలువని తెలియచేస్తుంది అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. అందరూ జాగ్రత్తగా ఉండండి,నేను బాగున్నాను, నా పిల్లల్ని , ఫ్యామిలిని మిస్ అవుతున్నాను, వాళ్లని త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాను అంటూ , నేను ఐసియు లో లేను అంటూ వ్యాఖ్యానించింది.

కనికా కపూర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టుని కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసింది. అయితే తనకి జీవితం విలువ తెలిసింది, ఐసియూలో లేను అంటూ ధైర్యంగా పోస్టు చేసిన కనికా, ఫోర్త్ టైం కూడా నెగటివ్ రావడంతో ఏమైనా కృంగిపోయుంటుందా? అందుకే ఆ పోస్టు డిలీట్ చేసిందా? ఏదేమైనా  నిబంధనలు పాటించకుండా కనిక చేసిన పనికి యావత్ దేశం అంతా కోపోద్రిక్తులైనప్పటికి, తన ఫ్యామిలిని, పిల్లల్ని చూడాలనుకుంటున్నా అని కనిక చేసిన పోస్టు కి ఎమోషనల్ అయ్యారు . తన ఆరోగ్యం మెరుగు పడుతుందో లేదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Sharing is Caring:
No more articles