సింగర్ కేకే మృతికి కారణమైన “మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్” అంటే ఏంటి?

సింగర్ కేకే మృతికి కారణమైన “మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్” అంటే ఏంటి?

by Sunku Sravan

Ads

కెకెగా ప్రసిద్ది చెందిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఒక లైవ్ షో లో తన పెర్ఫార్మన్స్ ఇస్తుండగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం ముంబైలో జరిగాయి. అయితే ఆయన మరణానికి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణమని వైద్యులు ప్రకటించారు.

Video Advertisement

లైవ్ షో సమయంలో అధిక ఉత్సాహం రక్త ప్రసరణను నిలిపివేసి గుండె ఆగిపోయి అతని ప్రాణాలను బలిగొంది. దాదాపు మూడు గంటల ప్రదర్శన తర్వాత సింగర్ కేకే భారీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించాడని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. స్పృహ తప్పి పడిపోయిన వెంటనే ఎవరైనా కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి ఉంటే కేకే బ్రతికేవారని వారు అభిప్రాయపడ్డారు.

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే ఏమిటి?

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ దీనినే మనం సాధారణంగా గుండెపోటు అని పిలుస్తాము. గుండె కండరాలలో ఒక భాగానికి తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది. గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని నిలిపివేసే కొరోనరీ ఆర్టరీ యొక్క తీవ్రమైన స్పామ్ లేదా ఆకస్మిక సంకోచం వల్ల గుండెపోటు సంభవిస్తుంది.

KK

KK

KK కి ఏమి జరిగింది?

అధిక ఉత్సాహం కొన్ని క్షణాల పాటు రక్త ప్రవాహాన్ని నిలిపివేసిందని, ఫలితంగా చాలా తక్కువ సమయం పాటు గుండె కొట్టుకోవడం సక్రమంగా లేదని KK కు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ చెప్పారు.
కేకే యాంటాసిడ్‌లో తీసుకున్నట్లు పోస్టుమార్టం లో తేలింది. జీర్ణ సమస్య అనుకోని బహుశా ఆ పని చేయొచ్చని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కానీ కెకె చాలా యాంటాసిడ్లు తీసుకునేవాడని గాయకుడి భార్య అంగీకరించినట్లు కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారి వెల్లడించారు.


End of Article

You may also like