Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ అంచనాలు పెంచేసాయి.
పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప నుంచి వచ్చిన అప్ డేట్ తో సామ్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఓ అంటావా ఓ ఓ అంటావా అనే ఈ పాట రేపు విడుదల అవుతుంది. ఈ పాటతో ఒక కొత్త గాయని పరిచయం అవ్వబోతున్నారట. తన పేరు ఇంద్రావతి. ఇందు అలియాస్ ఇంద్రావతి ఎవరో కాదు, సింగర్ మంగ్లీ చెల్లెలు. నిజానికి ఇంద్రావతి జార్జ్ రెడ్డి సినిమాలో ఒక పాట పాడారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాట బయటికి రాలేదు. దాంతో ఇలా పుష్ప సినిమాతో ఇంద్రావతి తన గాత్రం వినిపించబోతున్నారు.
End of Article