Home Filmy Adda “దయచేసి ప్రజలని ఇబ్బంది పెట్టకండి..” : “సీఎం కేసిఆర్” కి విజ్ఞప్తి చేసిన గాయకుడు “శ్రీరామ చంద్ర”..

“దయచేసి ప్రజలని ఇబ్బంది పెట్టకండి..” : “సీఎం కేసిఆర్” కి విజ్ఞప్తి చేసిన గాయకుడు “శ్రీరామ చంద్ర”..

by Anudeep

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ శ్రీరామచంద్ర ఒకరు. ఆయన తన పాటలతో ఎంతో మందిని అలరించారు. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచినా శ్రీరామ చంద్ర తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా కనిపించారు. ప్రస్తుతం సింగింగ్‌ కెరీర్‌లో బిజీగా ఉన్నాడు శ్రీరామచంద్ర. అయితే తాజాగా తనకు ఎదురైనా ఒక అనుభవం గురించి ఆయన ఒక వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

 

 

ప్రస్తుత కాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులు తమ పార్టీ పనుల నిమిత్తం బహిరంగ సభలను ఏర్పాటు చేయడం లేదా ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఇలా రాజకీయ నాయకులు రోడ్లపై ఇలాంటి సభలు ర్యాలీలో నిర్వహించడం వల్ల ఎంతో మంది సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఒక సంఘటన వాళ్ళ తానూ ఇబ్బంది పడ్డానంటూ తాజాగా ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మినిస్టర్ కేటిఆర్ గారికి తన విన్నపాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు సింగర్ శ్రీ రామ చంద్ర.

singer srirama chandra humble request to CM KCR..!!

“ఓ రాజకీయనాయకుడి కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో అందరూ ఫ్లై ఓవర్‌ కింద నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో నా ప్రయాణం అరగంట ఆలస్యం అయ్యింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో నేను ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. అప్పటికి వేరే ఫ్లైట్ తీసుకొని గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరో 15 మంది కూడా ఈ కారణంగానే ఫ్లైట్‌ మిస్సయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ వీడియో షేర్ చేశాడు శ్రీరామచంద్ర.

singer srirama chandra humble request to CM KCR..!!

ఈ వీడియో వైరల్ కావడం తో సింగర్ శ్రీరామచంద్రకు ఈ విషయంలో నెటిజెన్స్ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. చాలా మంది నెటిజనులు.. తమకు కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటూ పోస్ట్‌ చేయసాగారు. కానీ ఈ విషయంలో మార్పు ఎక్స్‌పెక్ట్‌ చేయడం అత్యాశే అంటున్నారు నెటిజన్లు.

 

You may also like