Ads
ఒక మనిషికి ఒక విషయంలో మాత్రమే కాకుండా రెండు, మూడు విషయాల్లో ప్రావీణ్యం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక వ్యక్తి ఒక సినిమాని నిర్మించి, దానికి దర్శకత్వం వహించగలరు. అలాగే దర్శకత్వంతో పాటు, సంగీత దర్శకత్వం కూడా వహించగలరు.
Video Advertisement
సంగీత దర్శకులు కూడా ఒక పాటని కంపోజ్ చేయగలరు, అలాగే పాడగలరు. అయితే ఇలా మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ లో మంచి నటులు కూడా ఉన్నారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఆయన మంచి నటులు కూడా. బాలు గారు ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రేమికుడు, మిధునం సినిమాల్లో ఆయన నటన మనం ఎప్పటికి మరచిపోలేము.
#2 మనో
మనో గారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అందులో రామ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన శివం సినిమాలో రాశీ ఖన్నా తండ్రిగా నటించారు మనో గారు.
#3 ఆండ్రియా
ఆండ్రియా తెలుగులో తడాఖా తో పాటు తమిళ్ లో అయిరత్తిల్ ఒరువన్ (తెలుగులో యుగానికి ఒక్కడు), వడ చెన్నై, మాస్టర్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.
#4 జీవీ ప్రకాష్ కుమార్
డార్లింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జి.వి.ప్రకాష్ కుమార్ కూడా సంగీత దర్శకత్వం వహించడం, అలాగే ఎన్నో పాటలను పాడడంతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. తెలుగులో నాగ చైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 100% లవ్ తమిళ్ రీమేక్ అయిన 100 పర్సెంట్ కాదల్ లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించగా, అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి పరిచయమైన షాలిని పాండే హీరోయిన్ గా నటించారు.
#5 తమన్
సంగీత దర్శకుడు తమన్ కూడా బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.
#6 హిమేష్ రేషమ్మియా
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే సింగర్ హిమేష్ రేషమ్మియా కూడా హీరోగా, అలాగే ముఖ్య పాత్రల్లో కూడా నటించారు.
#7 భానుమతి
భానుమతి గారు ఎన్నో సినిమాల్లో నటించారు దర్శకత్వం వహించారు, అలాగే ఎన్నో మంచి పాటలను కూడా పాడారు. భానుమతి గారు పాడిన పాటలని ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం.
#8 సాందీప్
నువ్వు నేను సినిమాలోని నా గుండెలో నీవుండిపోవా, అంజి సినిమాలో మానవా మానవా తో పాటు ఇంకా ఎన్నో పాటలను పాడిన సాందీప్ కూడా ప్రేమ యనమః, ఇంకోసారి తో పాటు, సందీప్ కిషన్ హీరోగా నటించిన టైగర్ సినిమాలో కూడా నటించారు.
#9 శ్రీ రామచంద్ర
ఎన్నో సినిమాల్లో పాటలు పాడి, అలాగే ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన శ్రీ రామచంద్ర కూడా హీరోగా నటించారు.
#10 రఘు కుంచే
సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రఘు కుంచే గారు కూడా బాచీ, హోలీ, పలాస సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరించారు.
#11. దేవి శ్రీ ప్రసాద్
దేవి శ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో కనిపిస్తారు.
#12. బాబా సెహెగల్
బాబా సెహగల్ రుద్రమదేవి సినిమాలో నటించారు.
#13. నోయెల్
నోయల్ ఈగ, కుమారి 21ఎఫ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో ఇంకా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు.
#14. స్మిత
సింగర్ స్మిత కూడా మల్లీశ్వరి సినిమాలో ఒక పాత్రలో నటించారు.
#15. ఘంటసాల మాస్టర్
ఘంటసాల గారు కూడా శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో నటించారు.
End of Article