Ads
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నిజజీవితంలో ప్రేమించుకుని, తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే సంగీత రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా, అదే రంగానికి చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 హేమచంద్ర – శ్రావణ భార్గవి
ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్ర, సింగర్ శ్రావణ భార్గవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రావణ భార్గవి కూడా గాయనిగా మాత్రమే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు.
#2 టిప్పు – హరిణి
గాయకులు టిప్పు, హరిణి కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరూ తమిళ్, తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా ఎన్నో పాటలను పాడారు.
#3 మల్లికార్జున్ – గోపిక పూర్ణిమ
ప్రముఖ గాయకులు మల్లికార్జున్, గోపిక పూర్ణిమ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
#4 జీవీ ప్రకాష్ – కుమార్ సైంధవి
ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్, నటుడు అయిన జీవీ ప్రకాష్ కుమార్, తెలుగు, తమిళ్ లో ఎన్నో పాటలను పాడిన సైంధవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సైంధవి కేవలం తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా వేరే భాషల్లో కూడా పాటలను పాడారు.
#5 తమన్ – శ్రీ వర్ధిని
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, శ్రీ వర్దిని ని పెళ్లి చేసుకున్నారు.
#6 సాయి కార్తీక్ – దివిజ కార్తీక్
ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్, గాయని దివిజ కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దివిజ సుప్రీమ్, పటాస్ తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.
End of Article