బాల్యవివాహాన్ని ఆపడం కోసం ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసా.? సీఎం అవార్డుతో సత్కరించారు.!

బాల్యవివాహాన్ని ఆపడం కోసం ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసా.? సీఎం అవార్డుతో సత్కరించారు.!

by Anudeep

Ads

ఆ అమ్మాయి వయసు పదమూడేళ్లు , చదివేది ఎనిమిదో తరగతి . అయితేనేం ధైర్యంగా తన అక్కకు జరుగుతున్న బాల్యవివాహాన్ని ఆపడానికి ప్రయత్నించింది. పెళ్లిని ఆపే ప్రయత్నంలో కుటుంబాన్ని ఎదిరించింది. ఎట్టకేలకు సోదరి వివాహం ఆగిపోయేలా చేసి, తను పై చదువులు చదువుకునేలా కుటుంబాన్ని ఒప్పించింది. బాల్యవివాహాన్ని ఆపి, ఒక అమ్మాయి భవిష్యత్ కు కాపాడినందుకు ప్రశంసగా సిఎం చేతుల మీదుగా అవార్డు అందుకోబోతుంది. తను చేసిన పనివల్ల కుటుంబానికి, స్కూల్లో మిగతా స్టూడెంట్స్ కి ఆదర్శంగా నిలుస్తుంది వన్షిక .

Video Advertisement

source

ఉత్తర ప్రదేశ్ లోని ఖర్ఖౌదా ప్రాంతానికి చెందిన వన్షిక గౌతమ్ వయసు 13 ఏళ్ళు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఏడాది క్రితం వర్షక సోదరి వరసయ్యే అమ్మాయికి  పెళ్లి చేయాలని వాళ్ళ తల్లి తండ్రులు  పెళ్లి  నిశ్చయించారు. ఆ అమ్మాయి వయసు పదహారేళ్లు. దీంతో ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలని నిశ్చయించుకుంది వన్షిక . దానికోసం తనవంతు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది.

పెళ్లిని ఆపమని, బాల్య వివాహం చేయడం తప్పని తన తల్లితండ్రులకు మొదట  చెప్పింది. వన్షిక మాటలను  కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. అయినా పట్టు విడువకుండా డైరెక్టుగా పెళ్లి కూతురు తల్లి తండ్రుల దగ్గరకు వెళ్లింది. బాల్య వివాహం నేరమని, ఆమెకు చాలా భవిష్యత్తు ఉందని, పై చదువులు చదివించమని కావాలంటే మరో రెండేళ్లు ఆగి, 18ఏళ్లు వచ్చాక వివాహం చేయమని చెప్పింది. ఒకసారి చెప్పి వదిలేయకుండా  పదే పదే చెప్తుండడంతో ఆలోచనలో పడ్డారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. వన్షిక చెప్పిందే సరైనదని మనసు మార్చుకుని వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అంతేకాదు  తమ బిడ్డను పై చదువులు చదివిస్తామని మాటిచ్చారు.

బాల్యవివాహాన్ని ఆపి, ఒక అమ్మాయి చదువు కొనసాగించేలా చేసినందుకు ప్రశంసగా సిఎం యోగి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా సిఎం యోగి అవార్డు తో సత్కరించనున్నారు.  సిఎం చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్న వన్షిక మా స్కూల్ విద్యార్ధి కావడం చాలా సంతోషం అని స్కూల్ టీచర్స్ సంతోషపడుతున్నారు.

అయితే వన్షిక కు ఇలాంటి విషయాలేమీ కొత్త కాదు. ఆమె సామాజికి సమస్యలపై అవగాహానా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటుంది.  తమతోటి విద్యార్ధులలో ఎవరికి ఏ సమస్య వచ్చినా  ధైర్యంగా దాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యేలా చూస్తుందని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు.


End of Article

You may also like