Ads
ఇండస్ట్రీలో తమ తల్లి నుండి లేదా తండ్రి నుండి నటన వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్న నటీనటులే కాకుండా సోదరీ సోదరుల నుండి నటనను ముందుకు తీసుకు వెళుతూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటులు ఎంతో మంది ఉన్నారు.
Video Advertisement
అన్న తర్వాత వచ్చిన తమ్ముడు, అలాగే సోదరి తర్వాత వచ్చిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది అక్క చెల్లెళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 జయసుధ – సుభాషిణి
సుభాషిణి గారు కూడా ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో నటించారు. అరుంధతి సినిమాలో సోను సూద్ తల్లి గా కనిపించారు.
#2 రాధిక – నిరోషా
నిరోషా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు నిరోష.
#3 కాజల్ అగర్వాల్ – నిషా అగర్వాల్
ఏమైంది ఈ వేళ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిషా అగర్వాల్ తర్వాత సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.
#4 భాను ప్రియ – శాంతి ప్రియ
శాంతి ప్రియ కూడా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ఎక్కువగా హిందీ సీరియల్స్ లో కనిపిస్తారు.
#5 ముమైత్ ఖాన్ – జుబైద్ ఖాన్
జుబైద్ ఖాన్ జగడం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించారు. తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
#6 సిమ్రాన్ – మోనాల్
మోనాల్ తమిళ సినిమాల్లో నటించారు. 2002లో మోనాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
#7 కరిష్మా కపూర్ – కరీనా కపూర్
కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఇద్దరూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
#8 కత్రినా కైఫ్ – ఇసబెల్లా
ఇసబెల్లా కైఫ్ ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు.
#9 శృతి హాసన్ – అక్షర హాసన్
అక్షర హాసన్ తమిళ్ లో వివేగం, కదరం కొండాన్ సినిమాల్లో చేశారు. అలాగే హిందీలో కూడా రెండు సినిమాల్లో నటించారు.
#10 సంజన గల్రాని – నిక్కీ గల్రాని
నిక్కీ గల్రాని తమిళ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా కృష్ణాష్టమి సినిమాలో నటించారు.
#11 జ్యోతిక – నగ్మా – రోషిని
రోషిని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో నటించారు
#12 నమ్రత శిరోద్కర్ – శిల్పా శిరోద్కర్
శిల్పా శిరోద్కర్ కూడా హిందీ సినిమాలు సీరియల్స్ తో పాటు తెలుగులో కూడా ఒక సినిమాలో నటించారు.
#13 ప్రీత – శ్రీదేవి – వనిత
వనిత దేవి సినిమాలో మరొక హీరోయిన్ గా నటించారు.
#14 షాలిని – షామిలీ
షామిలీ తెలుగులో ఓయ్ అమ్మమ్మగారిల్లు సినిమాల్లో నటించారు
#15 కాజోల్ – తనీషా
తనీషా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమాలో మరో హీరోయిన్ గా నటించారు.
#16 జయమాలిని – జ్యోతిలక్ష్మి
జయమాలిని గారు జ్యోతి లక్ష్మి గారు ఎన్నో సినిమాల్లో నటించారు.
#17 శిల్పా శెట్టి – షమితా శెట్టి
షమితా శెట్టి హిందీ సినిమాలతోపాటు తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాలో నటించారు.
#18 షావుకారు జానకి – కృష్ణ కుమారి
కృష్ణ కుమారి గారు తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీ కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
#19 కల్పనా – ఊర్వశి – కళారంజని
కల్పన గారు తెలుగులో ఊపిరి సినిమాలో నటించారు. ఊర్వశి గారు కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. కళారంజని గారు ఎక్కువగా మళయాళం సినిమాల్లో, అలాగే టీవీ షోస్ లో కూడా నటించారు.
#20 హరిత – రవళి
రవళి ఎన్నో సినిమాల్లో నటించారు. హరిత సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
#21 లలిత – పద్మిని – రాగిణి
వీరిని ట్రావెన్కోర్ సిస్టర్స్ అని కూడా పిలుస్తారు. మీరు తెలుగు తమిళ్ కన్నడ మళయాళం సినిమాల్లో నటించారు. ప్రముఖ నటులు శోభన, వినీత్ వీరికి బంధువులు అవుతారు.
#22 శుభ శ్రీ – మాలా శ్రీ
శుభ శ్రీ జెంటిల్మెన్, ముత్తు, పెదరాయుడు సినిమాలతో ఎంతో గుర్తింపు పొందారు. మాలాశ్రీ కూడా తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
#23 సాక్షి శివానంద్ – శిల్పా ఆనంద్
శిల్పా ఆనంద్ విష్ణు హీరోగా నటించిన మొదటి సినిమా విష్ణు సినిమాలో హీరోయిన్ గా నటించారు.
#24 ఆర్తి అగర్వాల్ – అదితి అగర్వాల్
అదితి అగర్వాల్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు.
#25 కార్తీక నాయర్ – తులసి నాయర్
తులసి నాయర్ మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగులో కడలి పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించారు.
End of Article