జగపతి బాబు హీరో గా వచ్చిన “శివరామరాజు” సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఈ సినిమాలో అన్నా చెల్లెలి బంధాన్ని అద్భుతం గా చూపించారు. ఈ సినిమాలో జగపతి బాబు చెల్లెలి గా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఆమె ఎవరో కాదు మోనిక. ఆమె తెలుగునాట తక్కువ సినిమాలే చేసినా చాలా మంది హృదయాలలో గుర్తుండిపోయారు. మణిరత్నం దర్శకత్వం లో మోనిక “ఇందిరా” అనే సినిమాలో కూడా నటించారు.

monika 3

తెలుగులోనే కాదు.. ఆమె తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. మొత్తం నాలుగు భాషల్లోనూ కలిపి ఆమె 70 సినిమాల వరకు నటించారు. “శివ రామ రాజు” సినిమా తరువాత “పైసా లో పరమాత్మా”, “మా అల్లుడు వెరీ గుడ్” వంటి సినిమాలలో కూడా మోనిక నటించారు. ఆమె తండ్రి హిందువు కాగా, తల్లి క్రిష్టియన్. ఆమె ఇస్లాం మతం స్వీకరించి తన పేరుని ఎంజి రహీమా గా మార్చుకున్నారు. ఒక ముస్లిం కుటుంబానికే ఆమె కోడలి గా వెళ్లారు.

monika 2

మోనిక తండ్రి స్నేహితుడు కుమారుడే మాలిక్. వీరి స్నేహం మాత్రమే కాదు.. వీరి పిల్లలైనా మోనిక, మాలిక్ ల మధ్య కూడా స్నేహం చిగురించింది. వీరిద్దరూ వివాహబంధం తో ఒక్కటయ్యారు. ఈ విషయమై మోనిక ప్రకటన కూడా ఇచ్చింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఆదరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఈ రంగాన్ని వదిలివెళ్లాలంటే బాధగానే ఉందని పేర్కొంది.

అయితే.. తప్పడం లేదని పేర్కొంది. తానూ ప్రేమ కోసమో.. డబ్బు కోసమో మతం మార్చుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇస్లాం మతం లోని అంశాలు తనకు నచ్చి మతం మార్చుకుంటున్నానని ప్రకటించింది. ఆ తరువాత నుంచి ఆమె సినిమాలకు దూరం గా నే ఉంటూ వచ్చింది. తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న “పుష్ప” సినిమాలో ఆమె నటిస్తున్నారని సమాచారం.