అవకాశాల్లేవు.. డబ్బుల్లేవు.. ఆ టైంలో సినిమాల్లోకి వచ్చిన శివ శంకర్ మాస్టర్.. సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారంటే..?

అవకాశాల్లేవు.. డబ్బుల్లేవు.. ఆ టైంలో సినిమాల్లోకి వచ్చిన శివ శంకర్ మాస్టర్.. సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారంటే..?

by Anudeep

Ads

శివశంకర్ మాస్టర్ అందరికి నటుడిగానే.. జడ్జిగానే తెలుసు. ఆయన ఓ అద్భుతమైన నృత్య దర్శకుడు అని సినిమా పరిశ్రమకి మాత్రమే తెలుసు. ఆయన లేని లోటుని ఈ సినీ పరిశ్రమ పూడ్చలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శివ శంకర్ మాస్టార్ నిన్న రాత్రి శివైక్యం చెందారు.

Video Advertisement

ఆయన గొప్పదనము గురించి ఈరోజు మనం తెల్సుకుందాం. క్లాస్ అయినా మాస్ అయినా స్టెప్పులు వేయించగలగడం శివ శంకర్ మాస్టర్ ప్రత్యేకత. మన్మధ రాజా అంటూ మనోజ్ తో మాస్ స్టెప్పులు వేయించినా.. ధీర ధీర అంటూ రామ్ చరణ్ తో క్లాస్ స్టెప్స్ వేయించినా ఆయన శైలే వేరు.

sivasankar master 3

దాదాపు మూడు తరాల హీరోలతో శివ శంకర్ మాస్టర్ స్టెప్పులు వేయించారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబులకు కూడా శివ శంకర్ మాస్టర్ స్టెప్పులేయించారు. ఆ తరువాతి తరం బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి వంటి హీరోలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. తరువాతి తరంలో రామ్ చరణ్, మంచు మనోజ్ లకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. పలు డాన్స్ రియాలిటీ షోలలో జడ్జి గా కూడా వ్యవహరించారు. పలు సినిమాల్లోనూ డాన్సర్ గా నటించి మెప్పించారు.

sivasankar master 1

ఇదంతా చూస్తే ఆయన జీవితం వడ్డించిన విస్తరి అనుకుంటారు. కానీ.. శివశంకర్ మాస్టర్ డాన్స్ నేర్చుకోవడానికి.. నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. డిసెంబర్ 7 , 1948 లో జన్మించిన శివ శంకర్ మాస్టర్ చిన్నతనంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు తొమ్మిదిమంది అక్కలు ఉన్నారు. వారిలో ఒకరు ఒళ్ళో కుర్చోపెట్టుకున్న సమయంలో వారి ఇంటివైపు ఓ ఆవు వచ్చింది. దానిని చూసి భయపడి ఆవిడ లేచి పరిగెత్తబోయింది. ఈ క్రమంలో ఒళ్ళో ఉన్న ఏడాది వయసున్న శివశంకర్ మాస్టర్ కింద పడిపోయారు. దీనితో ఆయన వెన్నెముక విరిగింది. సర్జరీ చేసాక.. దాదాపు 8 ఏళ్ల చికిత్స తర్వాత కానీ ఆయన అడుగులు వేయలేకపోయారు.

sivasankar master 2

ఇటువంటి పరిస్థితిలో ఆయన డాన్స్ చేస్తారని, ప్రదర్శనలు ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన తండ్రి కల్యాణ సుందర్ కు పాటలు అంటే పిచ్చి. కుమారుడు నాటకాలు చూస్తానని ఆశపడితే.. డ్రైవర్ ను ఇచ్చి కార్ లో పంపేవారు. అలా నాటకాల పట్ల, నృత్యం పట్లా ఆకర్షితులైన శివశంకర్ మాస్టర్ పట్టుదలతో డాన్స్ నేర్చుకున్నారు. సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న శివశంకర్ మాస్టర్ 1974 లో అరంగ్రేటం చేసారు. అందుకోసం ఆయన తండ్రి ఆరోజుల్లోనే లక్ష రూపాయలు ఖర్చు చేశారట. ఆ తరువాత ఆయనకు అవకాశాలు వస్తాయని భావించారు.

sivasankar master 4

కానీ అవకాశాలు రాకపోవడంతో దిగులు చెందారు. మరో ప్రదర్శన ఏర్పాటు చేయాలంటే లక్ష ఖర్చవుతుంది. అయితే , తండ్రి పైసా కూడా అడగొద్దు అని ఆర్డర్ వేసేసరికి తానె సంపాదించుకోవాలనుకున్నారు. కజిన్ సిస్టర్ సాయంతో డాన్స్ డైరెక్టర్ సలీం వద్ద అసిస్టెంట్ గా చేరారు. అలా సినిమాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగారు. అమ్మోరు, యమదొంగ, అరుంధతి వంటి సినిమాలకు ఆయనకు బాగా పేరొచ్చింది. “ధీర ధీర” సాంగ్ కి ఆయనకీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పలు సినిమాల్లో నటుడిగాను రాణించారు. తమిళం లో దాదాపు 30 సినిమాలు చేసారు. కామెడీ నటుడిగా రాణించాలని శివశంకర్ మాస్టర్ ఆశపడేవారట.


End of Article

You may also like