అడవి తగలబడకుండా ఆపిన సాయాజీ షిండే…నువ్వు సూపర్ అంటూ కామెంట్స్..! (వీడియో)

అడవి తగలబడకుండా ఆపిన సాయాజీ షిండే…నువ్వు సూపర్ అంటూ కామెంట్స్..! (వీడియో)

by Anudeep

మెగాస్టార్  ఠాగూర్చిత్రంతో టాలివుడ్ కి విలన్‌గా పరిచయం అయిన నటుడు షియాజి షిండే . కేవలం విలన్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రల్లో నటిస్తూ తక్కువ కాలంలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాదు తమిళ , కన్నడ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన నటుడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు మెక్కలపై ఇష్టంతో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టేవారు . ఇప్పుడు ఏకంగా ఒక అడవిని రక్షించి నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు . అసలేం జరిగిందో చదవండి.


మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో నిన్న షియాజి తన కారులో ప్రయాణిస్తున్నారు.  అడవి తగలబడుతున్నట్టు కనపడడంతో, వెంటనే కారు ఆపి కిందికి దిగి తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమయానికి  నీళ్లు లేకపోవడంతో పచ్చి తుప్పలు పట్టుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు  మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయకుండా ఆపే ప్రయత్నం చేశారు.

Video Advertisement

తర్వాత  అటుగా వచ్చిన కార్పొరేటర్ రాజేష్ బరాతే కలవడంతో, ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు షిండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకున్న సామాజిక స్పృహకు హ్యాట్సాప్ చెబుతున్నారు.

ఇప్పటి వరకు షియాజే షిండే మొక్కల మీద ప్రేమతో మొక్కలు నాటే కార్యక్రమాలు చేశారు . ఇప్పుడు అడవిని రక్షించడంతో నిజమైన ప్రకృతి ప్రేమికుడు అనిపించుకున్నారు. మొక్కలపై ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు 3.5 లక్షల చెట్లను నాటారు షియాజి షిండే . అంతరించుకుపోతున్న భారత వృక్ష జాతులను కాపాడటానికి ఆయన ట్రీ లవ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ సాయంతో అనేక నగరాల్లో సయజీ పార్క్స్నిర్మించారు. వీటిలో అనేక భారతీయ వృక్ష జాతుల మొక్కలు సంరక్షించబతున్నాయి. సయజీ పార్క్స్‌తో పాటు ప్రతి పాఠశాలలో షిండే నర్సరీలను నిర్మించిన విద్యార్దుల్లో మొక్కల పట్ల ప్రేమని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసే షియాజి ఈ పనితో రియల్ హీరో గా ప్రశంసలు పొందుతున్నారు.

watch video:

 


You may also like