Ads
మాస్ సినిమాలకి పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైన, యాక్షన్ సీన్లు అయినా తన ఎనర్జీతో ఇరగదీసే రామ్ పోతినేని. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని అనుకున్నారు అంత. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే దీన్ని నెలలో పై ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు.
Video Advertisement
కొన్ని అనివార్య కారణాలవల్ల ఓటిటి రిలీజ్ వాయిదా పడి తర్వాత నవంబర్ 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. అయితే స్కంద సినిమాను ఓటిటిలో ఎగబడి మరీ చూస్తున్నారంట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతుంది.
ఏడాది హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా స్కందా నిలిచిందని తెలుస్తుంది. శ్రీ లీల రామ్ కాంబోలో వచ్చిన డాన్సులు అయితే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బోయపాటి మాస్ టేకింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. రామ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక లెవెల్ లో ఉంది.
అప్పట్లో బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం జయ జానకి నాయక బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ హాట్ స్టార్ లోనూ కనిపిస్తుంది మరో పక్క స్కంద సినిమా ఎడిటింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్న వాటన్నిటిని దాటుకుని ఈ సినిమా ఓటిటిలో దూసుకుపోతుంది. ఒకపక్క ట్రోలింగ్ జరుగుతున్న మరోపక్క ట్రెండింగ్ లో ఉండడం బోయపాటి సినిమాలు కే సాధ్యమని తెలుగు ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.రానున్న రోజుల్లో స్కందా సినిమా ఓటీటీలో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read:నటుడు “ఈశ్వరరావు” మరణానికి కారణం ఏంటో తెలుసా..? చివరి రోజుల్లో ఎక్కడ ఉన్నారు అంటే..?
End of Article