కరోనా మహమ్మారి శరీరం పై దాడి చేసిన తరువాత మానవ శరీరం నీరసించిపోతుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తీ తగ్గడం మూలం గా బలహీనం అవుతుంటాం. ఈ క్రమం లో ఇతర వైరస్ లు శరీరం పై ఎక్కువ గా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమం లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు ఇతర సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది చర్మ సమస్యలతో ఆసుపత్రుల వద్దకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

skin problems

కరోనా నుంచి కోలుకున్న వారిలో జుట్టు అధికం గా రాలుతుండడం, గోళ్ళ వ్యాధులు, చర్మ వ్యాధులు వంటివి తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే చాలా మందిలో హెర్పిస్ అనే చర్మ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ డి.ఎం.మహాజన్‌ తెలిపారు. కొందరు ఈ చర్మ సమస్యలను చూసి బ్లాక్ ఫంగస్ గా అభిప్రాయపడుతున్నారన్నారు.

skin problems 2

అయితే ఈ రెండు వ్యాధులు వేరు వేరు అని.. వీటి పై అవగాహనా పెంచుకోవాల్సి ఉందని అన్నారు. కరోనా కోసం ట్రీట్మెంట్ తీసుకునే సమయం లో మెడిసిన్ ను, స్టెరాయిడ్స్ ను ఎక్కువ మొత్తం లో తీసుకోవడం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరిలో క్యాండిడా ఫంగస్ సోకుతోందని.. దీనివలన జననేంద్రియాలలో తెల్ల మచ్చల్లాంటివి కనిపిస్తాయని ఆయన వివరించారు.