Skylab Review : నిర్మాతగా “నిత్యా మీనన్” మొదటి హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Skylab Review : నిర్మాతగా “నిత్యా మీనన్” మొదటి హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : స్కైలాబ్
  • నటీనటులు : నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తరుణ్ భాస్కర్.
  • నిర్మాత : పృథ్వీ పిన్నమరాజు
  • దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
  • సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
  • విడుదల తేదీ : డిసెంబర్ 4, 2021

స్టోరీ :

Video Advertisement

సినిమా జులై 1970 సమయాల్లో జరుగుతుంది. బండలింగంపల్లి అనే ఒక ఊరిలో స్కైలాబ్ పడుతుంది అనే అంశం చుట్టూ తిరుగుతుంది. గౌరీ (నిత్యా మీనన్), ప్రతిబింబం అనే ఒక మ్యాగజిన్ కి జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటుంది. గౌరీకి తన వృత్తి అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ సంస్థ మాత్రం గౌరీపై అంత నమ్మకంగా ఉండరు. జర్నలిస్ట్ గా తనను తాను నిరూపించుకోవడానికి ఒక చివరి అవకాశం ఇస్తారు. ఆనంద్ (సత్యదేవ్) ఒక డాక్టర్. ఆనంద్ కి బండలింగంపల్లిని హైదరాబాద్ కంటే బాగా అభివృద్ధి చేయాలి అని ఉంటుంది. రామ (రాహుల్ రామకృష్ణ) అదే ఊరికి చెందిన ఒక సుబేదార్ కుటుంబానికి చెందినవాడు. అసలు వీరు ముగ్గురు ఆ స్కైలాబ్ పడడం అనే వార్తని వారి సొంత ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారు? చివరికి వాళ్ళు అనుకున్నది చేశారా? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

skylab movie review

skylab movie review

రివ్యూ :

స్కైలాబ్ అనేది కొద్ది సంవత్సరాల క్రితం చాలా ప్రచారంలో ఉన్న వార్త. ఈ విషయంపై సినిమా తీయడం అనేది ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అందులోనూ ముఖ్యంగా ట్రైలర్ చాలా బాగుండడంతో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడబోతున్నాం అని అనిపించింది. సినిమా కథ బాగున్నప్పటికీ, కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది. ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులలో సహనం తగ్గుతూ ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత నిత్యా మీనన్ ని మనం ఒక డైరెక్ట్ తెలుగు సినిమాల్లో చూస్తున్నాం. నిత్యా మీనన్ తెరపై ఉన్నంతసేపు చలాకీగా చాలా బాగా చేశారు. పాత్ర కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకోవడం విశేషం.

skylab movie review

ఆనంద్ గా సత్యదేవ్, రామ గా రాహుల్ రామకృష్ణ కూడా బాగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ నటీనటుల పెర్ఫార్మెన్స్. అలాగే మిగిలిన పాత్రలు పోషించిన తనికెళ్ల భరణి, తులసి, తరుణ్ భాస్కర్ కూడా వారి పాత్రల్లో బాగా చేశారు. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ మరొక హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా 1970 సమయాల్లో ఉండే వాతావరణాన్ని కూడా చాలా బాగా చూపించారు. ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా, కథ రాసుకోవడంలో ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిత్యా మీనన్
  • 1970 వాతావరణాన్ని చూపించిన విధానం
  • క్లైమాక్స్ లో వచ్చే సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • స్లోగా నడిచే స్క్రీన్ ప్లే
  • లోపించిన ఎమోషనల్ కనెక్షన్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

స్కైలాబ్ సినిమాతో నిత్యా మీనన్ నిర్మాతగా మారారు. సినిమా ఒక మంచి ప్రయోగం అవుతుంది. మిగిలిన అన్ని అంశాలు బాగున్నా కానీ, కథ రాసుకోవడంలో జరిగిన పొరపాట్ల వల్ల స్కైలాబ్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

Also Read: Prabhas : “సలార్” నుండి లీక్ అయిన ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ డైలాగ్..!


End of Article

You may also like