Ads
డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా సినిమాకి పని చేసిన వాళ్ళ అందరి బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ని ఎంత పొగుడుతారో, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ ని అంతే ట్రోల్ కూడా చేస్తారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. మనందరం చెప్పే హిట్ లేదా ఫ్లాప్ అనే రెండు మాటల మీద ఆ డైరెక్టర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు.
Video Advertisement
ఇలాంటి వాటిని పూర్తిగా తప్పు అని చెప్పలేం. అలా అని పూర్తిగా కరెక్ట్ అని కూడా చెప్పలేం. ప్రతి సీన్ వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు మిస్టేక్ అనిపించేది ఒకవేళ అందులో కరెక్ట్ అయి ఉండొచ్చు ఏమో అని అనిపిస్తుంది. అందుకే వీటిని లాజిక్ కిందకి కన్సిడర్ చేయడమే కరెక్ట్. ఇలాంటి లాజిక్ కొంచెం అటూ ఇటూ అయిన సీన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి. ప్రస్తుతానికి దానికి ఉదాహరణ ఒకటి చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే.మొదటిది హ్యాపీ.
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో హీరో చేసిన ఒక పని గుర్తు చేసుకుని క్లాస్ లో ఉన్న హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ని లెక్చరర్ చూసి, క్లాస్ అయిపోయిన తర్వాత తనకు ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్తారు. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి నోటీస్ బోర్డ్ మీద ఉన్న రిజల్ట్ పేపర్ లో తన మార్క్స్ చూసుకుంటుంది. హీరోయిన్, లెక్చరర్ మాట్లాడుకున్న చోటుకి నోటీస్ బోర్డ్ ఉన్న చోటుకి చాలా దూరం ఉంటుంది.
కానీ హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయాసపడుతూ మార్క్స్ చూసుకునేటప్పుడు వెనకాల నుంచి ఆ లెక్చరర్ వస్తుంది. ఒకవేళ లెక్చరర్ కూడా అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారేమో అని అనుకోవచ్చు. కానీ లెక్చరర్ పరిగెత్తుకొచ్చినట్టు, లేదా ఆయాసపడుతున్నట్టు ఏమీ ఉండరు. చాలా నార్మల్ గా మాట్లాడుతారు. ఒకవేళ హీరోయిన్ అక్కడికి వచ్చి చాలా సేపు అయింది ఏమో అనే డౌట్ కూడా వస్తుంది. అందుకే వీటిని లాజిక్ అన్నాం.
ఇంకా డైరెక్టర్ కష్టం గురించి తెలుసు కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని పెద్దగా, కాదు కాదు అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వాటి మీద సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయం కూడా ఆధారపడి ఉండదు. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు, ఏదైనా మనకి చూపించిన దాని ప్రకారం ఉండనప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంతే.
End of Article