Ads
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఈవో కార్యాలయంలో కీలక అధికారిగా తన బాధ్యతలని నిర్వహించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక చర్చల్లో నిలిచారు. ఇప్పుడు ఆమెకి కొత్త ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనే చర్చ నెలకొంది.
Video Advertisement
వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ స్మిత సబర్వాల్ ని ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఈ క్రమంలో కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్, గురువారం నాడు తన కార్యాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
“తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న సర్పంచులు వారి యొక్క సూచనలు మరియు సమస్యల కోసం కలవడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం రాగలరు” అంటూ స్మితా సబర్వాల్ ఒక పోస్ట్ షేర్ చేశారు. అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ కూడా ఇచ్చి, ఆ తర్వాత ఎర్రమంజిల్ లో ఒక చిన్న కార్యాలయం ఉంది అని చెప్పారు. అంతే కాకుండా ఆఫీస్ అడ్రస్ ని గూగుల్ మ్యాప్ లింక్ ద్వారా షేర్ కూడా చేశారు.
అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చాలా కీలక పాత్ర పోషించారు. సీఈవో కార్యదర్శిగా తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులు పర్యవేక్షించారు.
అప్పట్లో ఆమె పర్యవేక్షిస్తున్న శాఖలకు సంబంధించి ఏదైనా సమస్య గురించి మాట్లాడదాం అంటే అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు అంత ఉన్నత అధికారంలో ఉండి ఇలా ఫోన్ నెంబర్ తో పాటు లొకేషన్ కూడా షేర్ చేశారు. ఆమె చేసిన పనికి చాలా మంది అభినందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్లు వారి యొక్క సూచనలు మరియు సమస్యలు కోసం కలవడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం రాగలరు.
For those of you seeking appointments/want to contribute to the efforts of TS Finance Commission the landline is- 040-23303520… pic.twitter.com/kI9YnS963h— Smita Sabharwal (@SmitaSabharwal) January 11, 2024
End of Article