స్మ్రితి మందాన రాసిన ఈ ఎమోషనల్ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి…నన్ను క్షమించండి అంటూ..!

స్మ్రితి మందాన రాసిన ఈ ఎమోషనల్ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి…నన్ను క్షమించండి అంటూ..!

by Anudeep

Ads

మన దేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకి ఉండదు. మొన్నటి వరకు పురుషుల క్రికెట్ పట్ల మాత్రమే ఆసక్తి ఉండేది. కాని ఇప్పుడు మహిళా క్రికెట్ ని కూడా అభిమానులు ఆదరిస్తున్నారంటే దానికి కారణం మన వాళ్ల ఆటనే. అందంతోనే కాదు, ఆటలో ప్రతిభతోనూ అందరి మనసులను చూరగొన్నారు మన లేడీ క్రికెటర్స్ . ఒక్కొక్కరికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే 2017 వరకు మహిళా క్రికెట్ గురించి పెద్దగా తెలియదు, కాని ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకోవడంతో అందరి దృష్టిని ఆకర్శించారు .

Video Advertisement

ఏ విధంగా అయితే మేల్ క్రికెటర్స్ పేరుని గుక్కతిప్పుకోకుండా చెప్పగలరు . మహిళా క్రికెటర్స్ కూడా పేరుపేరునా గుర్తిండిపోయారు. అభిమానులను సంపాదించుకున్నారు. స్మృతి మందనా, శెఫాలి, హర్మాన్ ప్రీత్ , పూనమ్ ఇలా ప్రతి ఒక్కరు తమ ఆటతో గుర్తింపు పొందారు .

కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళా క్రికెట్ కి ఆదరణ తక్కువే. కాని అది ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆ ఆలోచనల్ని పటాపంచలు చేసింది. మహిళా క్రికెట్ కి ఫాలోయింగ్ పెరిగిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఫైనల్ కి హాజరయిన క్రికెట్ అభిమానుల సంఖ్యనే 80లక్షలకు పైనే, ఇది కేవలం స్టేడియంలో మనుషుల సంఖ్య, టివిల్లో, మొబైల్ ఫోన్స్ లో చూసిన వారి లెక్క వేరే .

మహిళా దినోత్సవం రోజున ప్రపంచ కప్ ఫైనల్స్ కి చేరుకున్న ఇండియా జట్టు మన వాళ్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొత్త వాళ్లు క్రికెట్ వైపు మొగ్గు చూపేలా చేసింది. ఫైనల్స్ లో మన వాళ్లు ఓడిపోవడం నిరాశకి గురి చేసినప్పటికి వాళ్లు అక్కడి వరకు చేరుకున్నదానికి పడిన కష్టాన్నే అందరూ గుర్తించారు. ఈ సంధర్బంగా జట్టు కెప్టెన్  స్మృతి మందన్నా అభిమానులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు .

అభిమానులందరికి థాంక్స్ చెప్తూ స్టార్ట్ చేసిన ఆ లేఖలో, ఓడిపోయి నిరాశపర్చినందుకు క్షమించమని కోరింది. ఇంతమంది అభిమానం ఓడిపోయామనే బాధని దూరం చేసిందని, ఇక్కడి వరకు చేరుకోవడంలో మా టీం కృషి ఎంతో ఉందని , వారిని అభినందించింది. మీ అందరి అభిమానంతో మరింత ముందుకు వెళ్లడానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియా వేధికగా రాసిన ఈ ఓపెన్ లెటర్ ఇప్పుడు వైరల్ టాపిక్ గా మారింది. దీంతో నెటిజన్లు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ , జీవితంలో అయినా, ఆటలో గెలుపోటములు సహజం సారీ చెప్పొద్దు ,మీరు మీ శక్తికి మించి ఆడారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .


End of Article

You may also like