సాధారణం గా దూరం గా ఉన్న పాముని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అదే పాము మన ఇంట్లోకే వస్తే..? అది కూడా మనం అస్సలు ఊహించని టైం లో కనిపిస్తే? తలచుకుంటేనే భయమేస్తోంది కదా.. ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ లోకి నాగుపాము దూరింది.

snake in washing machine

ఆ ఇంటి ఇల్లాలు పని లో అలవాటు గా వాషింగ్ మెషిన్ ఓపెన్ చేయగానే కనపడిన నాగుపాముని చూసి హడలిపోయింది. నాగుపాము బుసలు కొడుతూ ఉండడం తో ఇంటిల్లిపాది వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాధానం అందిస్తే.. ఆయన వచ్చి చాకచక్యం గా దాన్ని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.