Ads
గాలి, నీరు అందకపోతే ఏ పాము అయినా ఏడాది కాలం పాటు బతకగలదా..? ఒక పాముని వైన్ సీసాలో బంధిస్తే.. తరువాత ఏడాది కాలం తరువాత ఆ సీసాను ఓపెన్ చేస్తే.. ఆ పాము బతికే ఉంటుందా..? తిరిగి మనుషుల్ని కాటేయగలుగుతుందా..? లేదు అనే అనిపిస్తోంది కదా.. కానీ ఏడాది కాలం పాటు వైన్ సీసాలో ఉన్న పాము లేచి కాటేసిన ఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి. నిజానికి ఇలాంటి వింతలు చైనాలోనే కనిపిస్తాయనుకుంటా. ఎందుకంటే అక్కడే ఇలాంటి వింత వైద్య విధానాలు అమలులో ఉన్నాయి.
వైద్య విధానాలా..? అని ఆశ్చర్యపోతున్నారా.? అక్కడ ప్రాచీన సాంప్రదాయ వైద్య విధానాలను కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఇలా పాములను వైన్ సీసాలో ఎక్కువ కాలం పాటు బంధించి ఉంచుతారు. ఇలా చేస్తే ఆ సీసాలో ఔషధ గుణాలు పెరుగుతాయని నమ్ముతుంటారు. చైనాలో ఓ వ్యక్తి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు కోసం ఇలాంటి వైన్ సీసాను ఒకదానిని కొనుగోలు చేసాడు. అయితే.. వెంటనే వాడకుండా.. కొంతకాలం దానిని దాచాలని అనుకున్నాడు. అలా కొంతకాలం వదిలేస్తే అందులో ఔషధ విలువులు పెరుగుతాయని అనుకున్నాడు.
దాదాపు ఏడాది తర్వాత ఆ వైన్ సీసాను ఓపెన్ చేయగా.. అందులోని పాము ఆ వ్యక్తిపై దాడి చేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని అతను బతికి బట్టకట్టాడు. అయితే.. చాల మంది ఆ పాము బతికి ఉండడమే అసాధ్యమని చెబుతున్నారు. కొందరేమో పాములు సుప్తావస్థలోకి వెళ్లగలవని అలాంటప్పుడు వాటికి చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటె సరిపోతుందని అంటున్నారు. కానీ జంతు శాస్త్ర నిపుణులు మాత్రం ఇతర జీవులకు మాదిరిగానే పాములకు కూడా బతకడని నీరు, గాలి, ఆక్సిజన్ అవసరమని చెబుతున్నారు.
End of Article