Ads
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి, ఇప్పుడు కూడా హీరోయిన్ తో పాటు ఎన్నో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు స్నేహ. స్నేహ అసలు పేరు సుహాసిని రాజా రత్నం నాయుడు. స్నేహ ముంబై లో పుట్టారు. స్నేహ పుట్టిన తర్వాత తన కుటుంబం మొత్తం షార్జా కి వెళ్లిపోయారు. తర్వాత తమిళనాడులోని పనృతి లో సెటిల్ అయ్యారు.
Video Advertisement
స్నేహా వాళ్ళ కుటుంబానికి చెన్నై కుంభకోణం (తంజావూర్) హైవే దగ్గర స్నేహ మహల్ అనే ఫంక్షన్ హాల్ కూడా ఉండేదట. 2000 సంవత్సరంలో ఒక మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు స్నేహ. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఒక తమిళ్ సినిమా కూడా చేశారు. 2001లో వచ్చిన తొలివలపు సినిమా తెలుగు ఇండస్ట్రీలో స్నేహ మొదటి సినిమా.
2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత స్నేహ, ప్రసన్న కలిసి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. కంఫర్ట్ లిక్విడ్ తో పాటు ఇంకా కొన్ని అడ్వటైజ్మెంట్స్ లో కలిసి కనిపిస్తారు. అయితే , వీరిద్దరూ అలా కలిసి నటించిన అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా దాదాపు 3.50 కోట్ల రూపాయలు సంపాదించారు అని సమాచారం.
వీరిద్దరికీ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇద్దరు చాలా క్రమశిక్షణతో నటిస్తారు అని, అడ్వర్టైజ్మెంట్స్ అయినా సరే ఎంతో డెడికేషన్ తో పని చేస్తారు అని అంటారు. అందుకే అడ్వర్టైజ్మెంట్స్ రూపొందించే వాళ్లు కూడా వీళ్ళని తీసుకోవడానికి ఎక్కువగా సుముఖత వ్యక్తం చేస్తారట.
అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే కాకుండా స్నేహ, ప్రసన్న ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రసన్న ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న నవరస లో ఒక కథలో నటించారు. ఇందులో తొమ్మిది కథలు ఉంటాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క ఎమోషన్ మీద ఉంటుంది. ఈ సిరీస్ ని మణిరత్నం గారు నిర్మించారు.
sneha – prasanna comfort advertisement – 1:
sneha – prasanna comfort advertisement – 2:
sneha – prasanna univercell advertisement:
sneha – prasanna godrej advertisement:
https://www.youtube.com/watch?v=4eLTj4NMPJg
End of Article