సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ టెక్కీ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ సార్..!

సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ టెక్కీ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ సార్..!

by Anudeep

Ads

“నెస్సెసిటి ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”.. వెలుగు అవసరం లేకపోతే ఎడిసన్ బల్బు కనిపెట్టి ఉండేవాడా? మన అవసరాలే మన చేత కొత్త కొత్త విషయాలను,వస్తువులను కనిపెట్టేలా చేస్తాయి. ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్. దీన్ని ఎదుర్కోవాలంటే మేజర్ రూల్ సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం. లాక్ డౌన్ ప్రకటించగానే అందరం ఎవరిళ్లల్లో వాళ్లం ఉంటున్నాం . ఒకవేళ బయటికి వస్తే సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎలా..ఆ సమస్య పరిష్కారమే నో క్యూ నౌ యాప్.

Video Advertisement

లాక్ డౌన్ నేపధ్యంలో బయటికి రావడానికి వీలు లేదు, కాని నిత్యావసర సరుకులకి మాత్రం ఖచ్చితంగా బయటికి వచ్చి తీరాలి. మనం వెళ్లిన సూపర్ మార్కెట్ దగ్గర ఖాళీ ఉంటుందని లేదు.  సరుకులు తీసుకునే దగ్గర నుండి బిల్లింగ్ వరకుఎవరి తొందర వారికే ,  మరి అలాంటప్పుడు ఇక సోషల్ డిస్టెన్స్ ఎక్కడ? వైరస్ అటాక్ చేయడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది.అలాంటి ప్రమాదం లేకుండా మనల్ని రక్షించేదే నో క్యూ నౌ యాప్.దీన్ని కనిపెట్టింది మరెవరో కాదు మన హైదరాబాదీ విజయానంద్ రెడ్డి.

మన స్మార్ట్ ఫోన్లో ఎన్నోరకాల యాప్లు ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ తో ఛాటింగ్ కి ఒక యాప్, ఫూడ్ ఆర్డర్ కి, గ్రాసరీస్ ఆర్డర్ కి, బిల్ పేమెంట్స్ కి ఇలా ఒక్కో పనికి రకరకాల యాప్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటిదే “నో క్యూ నౌ యాప్.”. నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ని ఇప్పటికే కొందరు వినియోగిస్తున్నారు. మీకు కూడా యాప్ సేవలు తెలుసుకోవాలనుంటే ముందుగా ఇన్స్టాల్ చేసి, అందులో మీరుంటున్న ప్రదేశాన్ని ఎంటర్ చేయండి. వెంటనే మీ చుట్టుపక్కల ఉన్న సూపర్ మార్కెట్లు, బజార్లు, కూరగాయల దుకాణాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

వాటిలో మనం వెళ్లాలనుకుంటున్న స్టోర్‌ తో పాటు టైమ్ స్లాట్‌ను ఎంచుకుంటే వెంటనే మన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే యూనిక్ పాస్‌వర్డ్, క్యూఆర్ కోడ్ పంపుతారు. మొబైల్ లేదంటే కంప్యూటర్ ద్వారా కూడా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు..మీరు బుక్ చేసుకున్న టైమ్ కే షాప్ కి వెళ్లి క్యూ ఆర్ కోడ్ చూపించి షాపింగ్ చేస్కోవచ్చు.

దీని కోసం మీరు చెల్లించాల్సిన డబ్బు ఎంతంటే???ఫ్రీ ఫ్రీ ఫ్రీ..అవును పూర్తిగా మీరు యాప్ పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు.  ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణెలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి..ఎలాగూ ఫ్రీ ఏ కాబట్టి సిటీలలో స్టోర్స్ బిజి కాబట్టి, మనకి ఆరోగ్యంకంటే ఏదీ ముఖ్యం కాదు కాబట్టి.. మరింకెందుకు ఆలస్యం ఇన్స్టాల్ చేసేయండి..


End of Article

You may also like