Ads
సోషల్ మీడియాతో ఏదైనా కూడా సాధ్యం. అసలు అప్పటి వరకు తెలియని వాళ్ళు, సోషల్ మీడియాతో సడన్ గా ఫేమస్ అయిపోతారు. సోషల్ మీడియాతో ఫేమస్ అయ్యి సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్న వారు కొందరు అయితే, సోషల్ మీడియాతో ఫేమస్ అయ్యాక వాళ్ళు నటించిన సినిమాలకి గుర్తింపు తెచ్చుకున్న వారు మరి కొందరు. అలా రెండవ కోవకి చెందిన వారు, గిరిజా ఓక్ గాడ్బోలె. గిరిజ ఒక నటి. ఎన్నో హిందీ సినిమాల్లో, సీరియల్స్ లో, మరాఠీ సినిమాల్లో కూడా నటించారు.
Video Advertisement
గిరిజని సోషల్ మీడియాలో అందరూ చూసే ఉంటారు. గిరిజ తండ్రి గిరీష్, ఒక మరాఠీ నటుడు. గిరిజ ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కండివాలి ఈస్ట్ నుండి బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత, థియేటర్ వర్క్‌షాప్‌లో చేరి ప్రకటనలలో నటించడం ప్రారంభించారు. గిరిజ 15 సంవత్సరాల వయసులో తెరపైకి అడుగు పెట్టారు. గోష్ట చోటి డోంగ్రేవధి, గుల్మోహర్, మణిని మరియు అద్గులే మద్గులేతో సహా కొన్ని మరాఠీ సినిమాలలో నటించారు. గిరిజ జీ మరాఠీలో లజ్జా అనే మరాఠీ టెలివిజన్ షోలో లీడ్ రోల్ లో నటించారు.

2018 లో, గిరిజ క్వార్టర్ అనే షార్ట్ ఫిలిమ్ లో నటించారు. ఈ షార్ట్ ఫిలిమ్ 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోర్ట్ మెట్రోజ్ (షార్ట్ ఫిల్మ్ కార్నర్) విభాగంలో ప్రీమియర్ చేశారు. అంతే కాకుండా, వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. గిరిజ తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. దాంతో పాటు, వివిధ అవార్డులు మరియు నామినేషన్లను కూడా అందుకున్నారు.

తర్వాత కొన్ని హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించారు. షోర్ ఇన్ ద సిటీ అనే హిందీ సినిమాలో సందీప్ కిషన్ పక్కన నటించారు. ఇటీవల వచ్చిన షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా, ప్రియమణి వాళ్లందరితో కలిసి జైల్ లో ఖైదీల్లో ఒకరిగా నటించారు.
ఇంక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, గిరిజ 2011 లో సుహృద్ గాడ్బోలేను వివాహం చేసుకున్నారు. వారికి కబీర్ అనే కొడుకు ఉన్నాడు. గిరిజ మరాఠీ సినీ నటుడు, సంభాషణ రచయిత మరియు చిత్ర నిర్మాత శ్రీరంగ్ గాడ్బోలే కోడలు.
End of Article
