తమన్నా ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడట…లావణ్య తో అఫైర్ అంట..! సోది స్టార్ అని కరెక్ట్ గా పేరు పెట్టారు.!

తమన్నా ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడట…లావణ్య తో అఫైర్ అంట..! సోది స్టార్ అని కరెక్ట్ గా పేరు పెట్టారు.!

by Anudeep

పాపులర్ కావడం ఎలా? రెండే మార్గాలు ఒకటి మనకున్న టాలెంట్ పదిమందికి చూపించుకుని , రెండోది కూడా మనకున్న టాలెంటే..కానీ ఆ టాలెంటేంటన్నది ప్రశ్న . ఉప్పల్ బాలు తెలుసు కదా బాగా ఫేమస్ , లోకులు కాకులు ఆంటీ ఇంకా ఫేమస్ , మచ్చ అబ్బో చాలా ఫేమస్ .ఇదొక రకమైన టాలెంట్. జనాల్ని భయపట్టే టాలెంట్, నవ్వించే టాలెంట్. ప్రస్తుతం ఆ కోవలోకే కొత్తగా వచ్చి చేరాడు సునిశిత్.

Video Advertisement

“శ్రీరామోజు సునిశిత్” పేరెప్పుడు వినలేదే అనుకుంటున్నారా? నిజానికి వన్ నేనొక్కడినేలో వినడం ఏం కర్మ చూసుండేవాళ్లం. ఒక వేళ మహేశ్ బాబు ఈయన నుండి ఆ ప్రాజెక్ట్ లాక్కోకపోయినుంటే. ఏం మాట్లాడుతున్నారు.మేం కాదండీ మాట్లాడేది ఆయనే అంటున్నారు “సుకుమార్ గారు ఫస్ట్ నన్నే తీసుకున్నారు, మహేశ్ తనకి హిట్లు లేవని బాధపడేసరికి ,నన్ను తప్పించారు”అని, కావలంటే ఆ సినిమా ప్రొడక్షన్ హౌజ్ కి వెళ్లి చెక్ చేస్కోండి నా స్టిల్స్ కూడా ఉంటాయని ఏ మాత్రం జంకు లేకుండా చెప్తున్నాడు.

అసలు మనోడు పేరు ఫస్ట్ వెలుగులోకి వచ్చింది యాంకర్ ప్రదీప్ గురించి ఏదో కామెంట్స్ చేసాడని , అబ్బే అప్పుడు జనాలు మనల్ని పట్టించుకోలేదనుకున్నాడో ఏమో? ఏకంగా ప్రిన్స్ పై కామెంట్స్ చేశాడు. అది కూడా చాలలేదు తాజాగా లావణ్య త్రిపాఠిపై కామెంట్స్ చేశాడు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, లావణ్య నాన్నే దగ్గరుండి పెళ్లి జరిపించారని చెప్పుకొచ్చాడు.

హాఠ్, తూట్ అని లావణ్య ఫ్యాన్స్ సునిశిత్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. విషయం లావణ్య వరకు చేరిందో లేదో, చేరితే తన రియాక్షన్ ఏంటో? ప్రస్తుతం సోషల్ మీడియా అనే కోతికి దొరికిన కొబ్బరిచిప్ప సునిశిత్ . ఒకవైపు అతన్ని తిడుతూనే,మరోవైపు నవ్వుకుంటూనే అతని వీడియోస్ ని వైరల్ చేస్తున్నారు జనం .ఇలాంటోళ్లని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తార్రా అని యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడుతున్నారు.

ఇంతకీ ప్రదీప్ విషయంలో చేసిన కామంట్స్ ఏంటంటే పెళ్లిచూపులు అనే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసిన ప్రదీప్, అందులో పార్టిసిపేట్ చేసిన జ్ణానేశ్వరి అనే అమ్మాయితో డేటింగ్ చేసి, చివరికి మోసం చేశాడని. ఇదే విషయంపై జ్ణానేశ్వరి స్పందిస్తూ ఇవన్ని ప్రదీప్ పై బురద చల్లే పనిలో భాగం అని తేల్చేసింది.

అసలు విషయం ఏంటంటే అప్పట్లో జ్ణానేశ్వరి కూడా ప్రదీప్ తనని మోసం చేశాడని పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్టు ఇదే సోషల్ మీడియలో చదివినట్టు గుర్తు. కొందరు సునిశిత్ కి పిచ్చని అంటుంటే, మరికొందరు యూట్యూబ్ ఛానెల్స్ కి బుర్రలేదు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో తెలీదు అంటున్నారు. ఇంతకీ వీటన్నిటి మధ్య బేజా ఫ్రై అయ్యేది మనకి .

watch video:


You may also like

Leave a Comment