Home News “అమ్మా నేనెలా బ్రతకను..?” అంటూ తల్లికి అంత్యక్రియలు చేసిన చోటే దారుణం…. అసలేమైందంటే..?

“అమ్మా నేనెలా బ్రతకను..?” అంటూ తల్లికి అంత్యక్రియలు చేసిన చోటే దారుణం…. అసలేమైందంటే..?

by Anudeep

ఢిల్లీ కి రాజైనా.. తల్లి దగ్గర చంటిపిల్లాడిలానే ఉంటాడు. తల్లి ప్రేమలో ఉన్న గొప్పదనం అది. అయితే తల్లి తండ్రులు ఎవరికీ జీవిత చరమాంకం వరకు ఉండరు. వారు ఉన్నంతకాలం ఒకలా.. వారు మనలని వదిలి వెళ్ళాకా మరోలా ఉంటుంది. వారు లేని జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. అమ్మ ప్రేమ అనంతం. ఆమె లేకుంటే ఎవరి జీవితం సజావుగా ఉండదు.

పెంచి పెద్ద చేసిన తల్లి చనిపోయేసరికి.. తట్టుకోలేక ఈ యువకుడు ఏమి చేసాడో తెలిస్తే కన్నీళ్లు వస్తాయి. ఇటీవల తల్లి చనిపోవడంతో తట్టుకోలేక తనయుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

vinay

వివరాల్లోకి వెళితే, గోల్నాక శ్యామ్‌నగర్‌ కు చెందిన నాగేందర్‌, లక్ష్మీబాయి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండేవారు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే నాగేందర్ మృతి చెందారు. లక్ష్మి బాయి కూలి పనులు చేస్తూనే పిల్లలిద్దరినీ (వినోద్‌కుమార్‌, విజయ్‌కుమార్‌) పెంచి పెద్ద చేసింది.

vinay 2

వినోద్ కుమార్ కు ఇంకా వివాహం అవలేదు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న వినోద్ కుటుంబ బాధ్యతలు పంచుకున్నాడు. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న లక్ష్మి బాయి ఇటీవల మృతి చెందింది. గత బుధవారం గోల్నాక హర్రాస్‌పెంట స్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తల్లి లేదన్న బాధని వినోద్ తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. తల్లిని ఖననం చేసిన చోటే ఉరి వేసుకుని మృతి చెందాడు.

You may also like