Ads
కరోనా దెబ్బ మనుషులలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.అలాంటి ఘటనలో రోజుకొకటి మనకు దర్శనమిస్తాయి.దీనికి ప్రధాన కారణం భయం.ఈ భయం ప్రజలకే కాదు ప్రభుత్వాలను కూడా చుట్టు ముట్టింది.అందువల్లే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ శవాలను వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి ప్రభుత్వాలు అంగీకరించట్లేదు.దీనితో జనాలకు తమ వారు చనిపోయారనే బాధకంటే వారిని చివరి చూపు చూడలేకపోయాం అనే బాధ ఎక్కువవుతుంది.
Video Advertisement
తాజాగా జిహాద్ అల్ అనే పాలస్తీనియన్ కరోనా బారిన పడిన తన తల్లిని చూడడానికి అక్కడి హాస్పిటల్ వారు అనుమతించకపోవడంతో హాస్పిటల్ ఎతైన గోడను ఎక్కి అద్దం నుండి తన తల్లిని చూసుకునేవాడు.ఇలా ఆమె ఐదు రోజులు ట్రీట్మెంట్ తర్వాత తుది శ్వాస ను విడిచింది.తల్లి కోసం తన కుమారుడు పడ్డ కష్టాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది చూసిన నెటిజన్స్ అతడు తల్లి కోసం చేసిన సాహసాన్ని కొనియాడుతున్నారు.
మరికొందరు అతనికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.మరి మీరు ఆ ఇమేజ్ పై ఓ లుక్ వేయండి.ప్రేమ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది అన్న దాని పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
End of Article