Ads
సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారు అంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి చిరంజీవి. సుప్రీం హీరో నుండి మెగాస్టార్ స్థాయికి చిరంజీవి ఎదిగారు. ఇన్ని సంవత్సరాల జర్నీలో చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా దాటుకొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఎక్ససైజ్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Video Advertisement
త్రిష ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. చిరంజీవి ఇన్ని సంవత్సరాల తన జర్నీలో ఎన్నో పాత్రలు చేశారు. ఒక సమయంలో కమర్షియల్ సినిమాలు చేశారు. కానీ మరొక పక్క నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేశారు. చిరంజీవి తనలో ఒక గొప్ప నటుడు ఉన్నారు అనే విషయాన్ని నిరూపించుకున్నారు. సినిమా కోసం తనని తాను మార్చుకునేవారు. ఇప్పటికి కూడా సినిమా కోసం చాలా కష్టపడతారు.
అందుకే ఎంత మంది హీరోలు వచ్చినా కూడా చిరంజీవి తమకి ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. అయితే చిరంజీవి ఒక సినిమాకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఏమో. అది కూడా సినిమాల్లోకి వచ్చాక, తను నటించిన ఒక సినిమాకే ఒక పాటకి కొరియోగ్రఫీ చేశారు. మరణ మృదంగం సినిమాలోని గొడవే గొడవమ్మ పాటకి చిరంజీవి కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో చిరంజీవి, సుహాసిని కనిపిస్తారు. 1988 లో వచ్చిన మరణం మృదంగం సినిమాకి కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు.
ఇళయరాజా సంగీతం అందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు గారు ఈ సినిమాని నిర్మించారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇందులో ఈ పాటకి చిరంజీవి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. పాట చూస్తూ ఉంటే ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ చేసినట్టే ఉంటుంది. ఇది చూస్తే చిరంజీవి మంచి డాన్సర్ మాత్రమే కాదు. మంచి కొరియోగ్రాఫర్ కూడా అనే విషయం అర్థం అవుతుంది.
End of Article