సినిమాల్లోనే విలన్…రియల్ లైఫ్ హీరో.! వలసకూలిల కోసం ఏం చేసారో తెలుసా?

సినిమాల్లోనే విలన్…రియల్ లైఫ్ హీరో.! వలసకూలిల కోసం ఏం చేసారో తెలుసా?

by Anudeep

Ads

కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో , వందలాది మంది వలసదారులు మహా నగరాల్లో చిక్కుకుపోయారు..చేసుకోవడానికి పనులు లేక, తినడానికి తిండి లేక, సొంత ఊర్లకు వెళ్దామంటే ట్రాన్స్ పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారకి నటుడు సోనూసూద్ బస్సులు ఏర్పాటు చేసారు.. అంతేకాదు వారికోసం భోజన సదుపాయాన్ని కూడా కల్పించి రియల్ హీరో అనిపించుకున్నారు.

Video Advertisement

ప్రముఖ నటుడు సోనూసూద్ వలస వచ్చినవారు ఇంటికి చేరుకోవడానికి  రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో పది బస్సులను అరేంజ్ చేసి వలస కార్మికులను మహారాష్ట్ర నుండి కర్ణాటకలోని గుల్బార్గాకు పంపించారు..రవాణా సౌకర్యంతోపాటు వారికి భోజనవసతి కూడా కల్పించారు సోనూసూద్. ఈ సంధర్బంగా సోనూ చెప్పిన మాట ఏంటంటే..”ప్రస్తుత ప్రపంచ సంక్షోభంలో, “ప్రతి భారతీయుడు వారి కుటుంబాలు మరియు ప్రియమైనవారితో కలిసి ఉండటానికి అర్హుడు” అని నమ్ముతున్నానని, అందువల్ల, వలస వచ్చినవారు ఇంటికి చేరుకోవడానికి తన వంతు సాయం చేసానని అన్నారు.

తను  అనుమతి కోరిన వెంటనే  మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహాయం చేసారని, అంతేకాదు కర్ణాటక ప్రభుత్వం వారిని స్వాగతిస్తున్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.కొన్ని రాష్ట్రాలు వలస కార్మికుల రాకను నిరాకరిస్తున్న విషయం తెలిసిందే..వలసకూలీలు చిన్నపిల్లలతో , ముసలి తల్లిదండ్రులతో రోడ్లపై నడుస్తూ వెళ్లడం చూసిన కొన్ని సంఘటనలు నిజంగా కదిలించాయి..ఇదేవిధంగా ఇతర రాష్ట్రాల వారిని కూడా పంపేందుకు నాకు తోచినంత సాయం చేయడానికి ప్రయత్నిస్తానని” భావోద్వేగానికి గురయ్యారు సోనూసూద్.

కేవలం వలసకూలిలకు సాయం చేయడమే కాదు, గతంలో పంజాబ్ వ్యాప్తంగా ఉన్న వైద్యులకు 1,500 పిపిఇ కిట్లను విరాళంగా ఇచ్చాడు మరియు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్యకార్మికుల వసతి కోసం తన ముంబై హోటల్‌ను వాడుకోండంటూ అనుమతిచ్చాడు. వారికి ఆ హోటల్లో  భోజన సదుపాయాన్ని కల్పించాడు. రియల్లీ గ్రేట్.. హ్యాట్సాప్ టు సోనూ సూద్..


End of Article

You may also like