వైన్ షాప్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయండన్న నెటిజెన్ కి…సోను సూద్ హైలైట్ కౌంటర్!

వైన్ షాప్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయండన్న నెటిజెన్ కి…సోను సూద్ హైలైట్ కౌంటర్!

by Anudeep

Ads

సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ ప్రస్తుతం రియల్ హీరో అనిపించుకుంటున్నారు.. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయి ప్రభుత్వాల అనుమతి తీసుకుని  బస్సులను ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపించాడు..ఈ నేపద్యంలో  అనేకమంది సోనూసూద్ కి రకరకాల విన్నపాలు చేస్తుంటే ఒక నెటిజన్  వింత కోర్కెను కోరాడు..దానికి సోనూ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది..టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో..

Video Advertisement

“సోనూ భాయ్ , నేను మా ఇంట్లో ఉండిపోయాను, నన్ను కొంచెం మద్యంషాపు వరకు తీసుకు వెళ్లడానికి సాయం చేయవా” ఇది ఒక నెటిజన్ సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టు..దీనికి సోనూసూద్ ఇచ్చిన రిప్లై ఏంటంటే “దాందేముంది, మద్యం షాపు నుండి తిరిగి ఇంటికి కూడా జాగ్రత్తగా తీస్కెళ్తాను, కాకపోతే అది ఇప్పుడు అత్యవసరం అయితే చెప్పండి”అంటూ రెస్పాండ్ అయ్యాడు.

వలస కూలిలను ఇళ్లకు పంపడం మాత్రమే కాదు..డాక్టర్లకు 1500 పిపిఇ కిట్లు పంపిణి, ముంబాయ్ లో ఉన్న తన స్టార్ హోటల్ ని పారిశుద్య, పోలీస్,వైద్య సిబ్బందిని వాడుకోమని చెప్పడం, వారికి కావలసిన సౌకర్యాలు,ఆహార వసతి కల్పించడం..ఒకటీరెండేమిటి..మొదటి నుండి అలుపెరగకుండా తనకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉన్నాడు సోనూ సూద్..డబ్బుది ఏముంది ఇప్పుడు ఉంది కాబట్టి సాయం చేస్తున్నాను, తర్వాత మళ్లీ సంపాదించుకుంటాను అని ధీమాగా చెప్తున్న సోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు..

కష్టకాలంలో ఆదుకుంటున్న వ్యక్తిని ఇలాంటి వెకిలి సాయం అడగడం ఎంతవరకు సబబు అని  ఆ వ్యక్తి చేసిన ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్స్.. సోనూ సూద్ ఇచ్చిన రిప్లై కి ఫిదా అవుతున్నారు.


End of Article

You may also like