Ads
కన్నబిడ్డ కోసం తల్లి ఎంత వరకైనా తెగిస్తుంది. ఎన్ని సాహసాలైనా చేస్తుంది. ఆమెకు తన బిడ్డ సంతోషమే ముఖ్యం. తాజాగా.. బిడ్డ సైకిల్ పోయిందని ఈ తల్లి చేసిన సాహసం చూస్తే ఎవరైనా హ్యాట్సాఫ్ అంటారు. ఇంతకు ఆమె ఏమి చేసిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Video Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కృష్ణ కుంజ్ కాలనీలో రాహుల్ అగర్వాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. భార్య, ఏడేళ్ల వయసున్న అద్విక్ అతని కుటుంబం. మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో అద్విక్ పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళాడు. సైకిల్ ను పార్క్ బయట పార్క్ చేసిన అద్విక్ కొంచం సేపు ఆడుకుని బయటకు వచ్చాడు.
తీరా బయటకు వచ్చేసరికి.. అక్కడ సైకిల్ కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించకపోవడం తో ఆ పిల్లాడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన తల్లికి జరిగింది చెప్పాడు. ఆమె ఆ పిల్లాడిని ఓదార్చి.. కొత్త సైకిల్ కొనిస్తానని చెప్పింది. కానీ.. ఆ పిల్లాడు తనకు ఆ సైకిల్ మాత్రమే కావాలి అంటూ ఏడ్చాడు. అన్నం తినను అంటూ మొండికేసాడు.
అది చూసి తల్లి సోనాల్ మరింత బాధపడింది. ఆ సైకిల్ ని ఎలా అయినా కనిపెట్టాలని భావించింది. పార్క్ కి దగ్గరలో ఉన్న సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించింది. టీనేజ్ వయసున్న ఓ పిల్లాడితో పాటు మరో స్కూల్ డ్రెస్‌లో ఉన్న పిల్లవాడు కలిసి ఆ సైకిల్ ను తీసుకెళ్లిపోవడాన్ని గమనించింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అనుకున్నా.. ఆ పిల్లలు చాలా చిన్న పిల్లలు. తెలిసి తెలియక ఇలాంటి పని చేసి ఉంటారని భావించింది.
ఫోన్ లో ఆ ఫుటేజీని రికార్డు చేసుకుంది. ఆ పిల్లల కోసం గాలించడం మొదలుపెట్టింది. స్కూల్ డ్రెస్ ఆధారంగా ఆ ఇద్దరిలో ఒక పిల్లాడిని పట్టుకోగలిగింది. అతని ద్వారా రెండో వ్యక్తిని కూడా పట్టుకుని సైకిల్ ఎక్కడ దాచారని అడిగింది. ఆ సైకిల్ ని 250 రూపాయలకు తుక్కు సామాన్లవాడికి అమ్మేశామని చెప్పడం తో… తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అడిగింది. అయితే సదరు షాపు యజమాని బుకాయించడంతో పోలిసుల సాయం తీసుకుంది. దీనితో ఆ షాపు యజమాని భయపడి సైకిల్ ను తిరిగి ఇచ్చేసాడు. ఆ తరువాత ఆ సైకిల్ ని చూసి ఆ బుడ్డోడి ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం వీరి స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
End of Article