సోను సూద్ గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఆయన ఔదార్యం గురించి ఇప్పటికే ఎన్నో కధనాలు ప్రసారం అయ్యాయి. తాజాగా.. ఆయన మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎంతో ఎదిగినా, స్టార్ అయిపోయినా కూడా.. సోనూసూద్ అత్యంత సాధారణమైన వ్యక్తిలానే ఉంటారు. అతని డౌన్ టు ఎర్త్ పెర్సొనాలిటీనే ఆయనను ఎంతో మందికి చేరువ చేసింది.

sonusood

ఆయన తన అభిమానుల విషయం లో కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఎవరైనా అడిగితె లేదనకుండా సాయం చేసే సోనూసూద్.. వారు పిలిస్తే కూడా అభిమానం కొద్దీ వెళ్తుంటారు.తాజాగా.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో ఓ సైడ్ కి ఉన్న జ్యూస్ షాప్ కు సోనూసూద్ సర్ప్రైజ్ విజిట్ చేసారు. ఆ షాపతను సోనూసూద్ ని చూడగానే ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. ఆ వ్యక్తితో కొంతసేపు సరదాగా గడిపాడు. ఆ తరువాత స్వయం గా జ్యూస్ ను తయారు చేసుకుని తాగారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించాలంటూ ఈ సందర్భం గా సోను పిలుపునిచ్చారు.