Ads
సోను సూద్ గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఆయన ఔదార్యం గురించి ఇప్పటికే ఎన్నో కధనాలు ప్రసారం అయ్యాయి. తాజాగా.. ఆయన మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
Video Advertisement
ఎంతో ఎదిగినా, స్టార్ అయిపోయినా కూడా.. సోనూసూద్ అత్యంత సాధారణమైన వ్యక్తిలానే ఉంటారు. అతని డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ నే ఆయనను ఎంతో మందికి చేరువ చేసింది.
తాజాగా.. తన అభిమాని కోసం రిస్క్ తీసుకున్నారు సోనూసూద్. ఓ ఆటోవాలాకు సోనూసూద్ అంటే అభిమానం. ఆయన్ని కలవాలని ముంబైకి కూడా వెళ్ళాడు. కానీ వీలు పడలేదు. నిరుత్సాహంతో తిరిగి వచ్చేసినా.. ఆటో పై మాత్రం సోనూసూద్ ని ఒక్కసారి కలిసే ఛాన్స్ ఇవ్వాలి అంటూ రాసుకున్నాడు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఇతని గురించి తెలుసుకున్న సోనూసూద్ హైదరాబాద్ వచ్చి ఆ ఆటోవాలాను కలిసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
End of Article