Ads
తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితమైన పేరు సౌందర్య.. కేవలం పేరుకే కాదు అందం, అభినయం, అణకువ అన్నిట్లో నిజంగా సౌందర్యకు సాటి ఎవరూ లేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సునామీలా దూసుకు వచ్చిన ఈ తార అతి చిన్న వయసులోనే ఆకాశంలో చెరిగిపోని తారగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సౌందర్య మరణించడం జరిగింది.
Video Advertisement
అయితే ఆమె ఫ్లైట్ ఎక్కడానికి ముందు తన వదినని కోరిన రెండు కోరికలు ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఫ్లైట్ కోసం బయలుదేరుతున్న సౌందర్య తనకు కుంకుమ మరియు కాటన్ చీర తీసుకురావాల్సిందిగా ఆమె వదినను కోరడం జరిగింది. బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సౌందర్యకు కాటన్ చీరల అవసరం కలిగిందట.
అదే విషయాన్ని ఆమె వదినకు తెలియపరచి తను వచ్చే లోపు తెచ్చి పెట్టమని చెప్పిందట. సౌందర్య చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె వదిన…బట్టలు తెచ్చి పెట్టమని వెళ్లిన సౌందర్య ఇక తిరిగి రాలేదు అని చెప్పి బాధపడ్డారు. ఏప్రిల్ 17 2004న సౌందర్య ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. చనిపోయే నాటికి సౌందరర్య వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.
బాలకృష్ణ నిర్మిస్తున్న నర్తనశాలలో ద్రౌపది పాత్రలో నటిస్తున్న సౌందర్య షూటింగ్ పూర్తికాకముందే మరణించింది. ఆమె మరణించడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా అది రిలీజ్ కూడా కాలేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా అగ్ర నటిగా పలు భాషలలో నటించి నేర్పించింది సౌందర్య. కొలంగల్ అనే తమిళ్ టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కూడా తన ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న సౌందర్య ఆమె హఠాత్ మరణం కారణంగా నెరవేరలేదు.
ALSO READ : ఈ చిన్న తప్పే సింగర్ “సాయి చంద్” మృతికి కారణమా..? ఇలా చేయకపోయి ఉంటే..?
End of Article