ఈ 5 మంది హీరోయిన్లకు ఉన్న బిజినెస్ ల గురించి మీకు తెలుసా.?

ఈ 5 మంది హీరోయిన్లకు ఉన్న బిజినెస్ ల గురించి మీకు తెలుసా.?

by Anudeep

Ads

భారత్ లో సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మరియు ఇతర ప్రాంతీయ సినిమా పరిశ్రమలు కలిపి చాలా సినిమాలనే నిర్మిస్తూ ఉంటాయి. దక్షిణ భారత పరిశ్రమ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్ర పరిశ్రమగా మారింది. బాహుబలి మరియు సూపర్ డీలక్స్ సహా అతిపెద్ద విజయాలతో అనేక తమిళ మరియు తెలుగు చిత్రాలు హృదయాలను గెలుచుకున్నాయి.

Video Advertisement

కామెడీ, రొమాన్స్ లేదా యాక్షన్ అయినా, దక్షిణ భారత చిత్రాలను కొట్టే సినిమాలు ఇంకా రాలేదు. సినిమా ఇండస్ట్రీలలో కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు. అలాగే.. ఒకసారి పాపులారిటీ సంపాదించుకున్న సెలెబ్రిటీలు తమ వ్యాపారాలపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు. అలా.. తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ తారలుగా పేరు సంపాదించుకుని.. బిజినెస్ లోను రాణిస్తున్న తారల లిస్ట్ పై ఓ లుక్ వేయండి.

#1 కాజల్ అగర్వాల్:

1 kajal
ఈ తెలుగింటి చందమామ ఇటీవలే గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై లోనే సెటిల్ అయిన ఈ భామ బిజినెస్ పరం గా కూడా రాణిస్తోంది. సినిమాకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే కాజల్ అగర్వాల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియంది కాదు. కాజల్ అగర్వాల్ తన సొంత జ్యువెలరీ లేబుల్ ‘మార్సాలా’ ను ప్రారంభించింది. ఇందులో ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా భాగస్వామి గా ఉంది.

#2 రకుల్ ప్రీత్ సింగ్:

2 rakul
రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కు కోటి రూపాయలు తీసుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. ప్రస్తుతం దక్షిణాది సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు మకాం మార్చారు. రకుల్ ప్రీత్ సింగ్ మూడు ఫంక్షనల్ ట్రైనింగ్ జిమ్‌ల యొక్క క్రియాశీల ఫ్రాంచైజీని కలిగి ఉన్నారు. వాటిలో రెండు హైదరాబాద్‌లో ఉండగా.. మరొకటి వైజాగ్ లో ఉంది. “తానూ ప్రతి రోజు జిమ్ చేస్తూ ఉంటానని., తానూ నటిని కాకపోతే జిమ్ ట్రైనర్ అయి ఉంటానని తన సన్నిహితులు చెబుతూ ఉంటారని” ఆమె చెప్పుకొచ్చారు.

#3 పారుల్ యాదవ్:


పారుల్ యాదవ్ ప్రముఖ నటి మాత్రమే కాదు. ఆమె నిర్మాత కూడా. కన్నడ సినిమాల్లో కొన్నిటిలో నిర్మాత గా వ్యవహరించారు. ఆమె మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. ఆమె టెలివిజన్ సీరియల్స్ భాగవ్యవతలో కూడా కనిపించింది. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థకు అధిపతి. షోబిజ్ పరిశ్రమలోకి ఆమె ఎంట్రీ ఇవ్వడానికి ముందే వ్యాపారాన్ని ప్రారంభించింది.

#4 ప్రణీత సుభాష్:

4 pranitha
తెలుగు హీరోయిన్ ప్రణీత్ సుభాష్ గురించి పరిచయమే అవసరం లేదు. ఆమె అందం, నటనతో పాటు, మంచితనం సాయం చేసే గుణం కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె లావెల్లె రోడ్ బెంగళూరులోని రెస్టారెంట్ యజమాని కూడా. ఓ సారి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన సమయం లో తన రెస్టారంట్ ను చెన్నై మరియు హైదరాబాద్ లలో విస్తరించబోతున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

#5 సమంత:

5 samantha
అక్కినేని వారి కోడలు సమంత అందం, అభినయం తో పాటు టాలెంట్ ను కూడా కలబోసుకుని పుట్టింది. పెళ్లి అయిన తరువాత ఆమె సినిమాలను సెలెక్టివ్ గా ఎంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఆమె వ్యాపారం లో కూడా అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ప్రత్యుష ఫౌండేషన్ తో సేవలు చేసిన సమంత.. “సాకి” పేరుతొ ఫ్యాషన్ ప్రపంచం లో కూడా వ్యాపారం చేయనున్నారు. పలు ఫ్యాషన్ దుస్తులను ఆమె పరిచయం చేస్తూ వస్తున్నారు.


End of Article

You may also like