Ads
ఏదైనా ఒక రంగంలో గెలుపోటములు అనేది సహజం. సినిమా రంగంలో కూడా అంతే. వేరే ఇండస్ట్రీ నుండి కొంత మంది నటులు మన ఇండస్ట్రీకి రావడం, మన ఇండస్ట్రీలో కొంత మంది నటులు వేరే ఇండస్ట్రీకి వెళ్లడం, మనం చూస్తూనే ఉంటాం. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు వేరే ఇండస్ట్రీలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
Video Advertisement
కానీ అక్కడ వారికి ఆశించినంత స్టార్ డమ్ లభించలేదు. వారిలో కొంత మంది బాలీవుడ్ కి కూడా వెళ్లారు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్నంత ఫలితాన్ని సాధించని వేరే ఇండస్ట్రీ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి హిందీలో ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్ సినిమాల్లో నటించారు.
#2 వెంకటేష్
వెంకటేష్ యమలీల హిందీ రీమేక్ అయిన తక్దీర్ వాలా, చంటి రీమేక్ అయిన అనారీలో నటించారు. తర్వాత తెలుగు సినిమాల పైనే తన పూర్తి శ్రద్ధ పెట్టారు.
#3 సుదీప్
కిచ్చ సుదీప్ కి ఈగ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో వచ్చింది. హిందీలో ఫూంక్, రణ్ సినిమాల్లో నటించారు.
#4 అరవింద స్వామి
అరవింద స్వామి హిందీలో సాత్ రంగ్ కే సప్నే, రాజా కో రాణి సే ప్యార్ హో గయా సినిమాల్లో నటించారు. కానీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
#5 పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాణీ ముఖర్జీ హీరోయిన్ గా నటించిన అయ్యా సినిమాలో నటించారు.
#6 త్రిష కృష్ణన్
త్రిష, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కట్టా మీఠా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.
#7 రంభ
తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రంభ కూడా హిందీలో కొన్ని సినిమాల్లో నటించారు.
#8 శృతి హాసన్
శృతి హాసన్ లక్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత దిల్ తో బచ్చా హై జీ, రామయ్యా వస్తావయ్యా, వెల్ కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్సమ్, డీ డే, బెహెన్ హోగీ తేరి, గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాల్లో నటించారు. కానీ హిందీలో కంటే శృతి హాసన్ కి తెలుగు, తమిళ్ లోనే ఎక్కువ గుర్తింపు లభించింది.
#9 రామ్ చరణ్
రామ్ చరణ్ హిందీలో జంజీర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
#10 తమన్నా భాటియా
తమన్నా హిందీలో హిమ్మత్ వాలాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.
#11 రానా దగ్గుబాటి
రానా కూడా హిందీలో దమ్ మారో దమ్ సినిమాలో నటించారు. అలాగే ఏ జవానీ హై దివానీ సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించారు.
#12 భూమిక
భూమిక సల్మాన్ ఖాన్ తో తేరే నామ్ సినిమాతో పాటు ఇంకా కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అలాగే ఎంఎస్ ధోని సినిమాలో ధోనికి అక్క పాత్రలో నటించారు. కానీ భూమిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
#13 హన్సిక మోత్వానీ
హన్సిక మోత్వానీ కోయీ మిల్ గయా సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. కానీ తర్వాత హన్సిక నటించిన హిందీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ హన్సిక కి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎంతో గుర్తింపు లభించింది.
#14 జ్యోతిక
జ్యోతిక హిందీ లో డోలి సాజా కే రఖ్నా సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రశాంత్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ్ సినిమా జోడి సినిమా కి రీమేక్.
#1 5 శ్రీయ సరన్
శ్రీయ హిందీలో తుజే మేరీ కసం తో పాటు ఆవారాపన్, దృశ్యంలో కూడా నటించారు. వీటిలో దృశ్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ శ్రీయ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు.
End of Article