ఆ ఫోటో పెట్టేసరికి పెళ్లి అంటూ రూమర్స్..! అసలు కథ ఏంటంటే..?

ఆ ఫోటో పెట్టేసరికి పెళ్లి అంటూ రూమర్స్..! అసలు కథ ఏంటంటే..?

by Anudeep

Ads

గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి తనయుడిగా ఎస్పీ చరణ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కేవలం వారసుడిగా మాత్రమే కాక తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు చరణ్.

Video Advertisement

నటుడిగా, నిర్మాతగా, గాయకుడుగా పలు అంశాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నిర్మాతగా పెద్దగా సక్సెస్ కానప్పటికీ సింగర్ గా రాణిస్తున్నాడు. మన్మథుడు సినిమాలో చరణ్ ఆలపించిన “నేను నేనుగా లేనే” పాట చరణ్ కి మంచి గుర్తింపు తెచ్చింది.

చరణ్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా చరణ్ చేసిన ఓ పోస్ట్ వివాదాంశం అయింది. 7/జీ బృందావన కాలనీ సినిమాతో తెలుగు కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సోనియా అగర్వాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆమెతో ఎస్పీ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

దీనికి.. ‘కొత్త ప్రయత్నం’ అంటూ ఎస్పీ చరణ్ కామెంట్ పెట్టడంతో.. అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎస్పీ చరణ్, సోనియాల పెళ్లి అని కొందరు నెటిజన్లు భ్రమపడ్డారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. ఆ వెంటనే జాగ్రత్తపడ్డ చరణ్ మళ్లీ ఓ పోస్ట్ పెట్టేశాడు. ‘ఫిల్మ్ ప్రొడక్షన్, ఇండియన్ వెబ్ సిరీస్’ అనే హ్యాష్ టాగ్‌లు జోడించడంతో అసలు విషయం అందరికీ అర్థమైంది. ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే నటించబోతోన్నారని, దానికి సంబంధించిన ఫోటోలే ఇవని ఓ క్లారిటీ వచ్చింది.

మొత్తానికీ ఈ ఇద్దరి పెళ్లి రూమర్లు మాత్రం ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ వివాహం, విడాకుల విషయం అందరికీ తెలిసిందే. 2006లో పెళ్లి, 2010లో విడాకులు జరిగాయి. అలా అప్పటి నుంచి సోనియా ఒంటరిగానే ఉంటోంది. అదేవిధంగా ఎస్పీ చరణ్ కూడా విడాకుల బాధితుడే. స్మితతో నాలుగేళ్ల బంధం కొనసాగించాడు. 2002లో స్మితకు ఎస్పీ చరణ్‌కు విడాకులయ్యాయి. ఆ తర్వాత 2012 లో అపర్ణను చరణ్ వివాహమాడాడు.


End of Article

You may also like