Ads
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో చిన్నవయసులోనే, హఠాత్తుగా కొందరు నటులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో కన్నుమూశారు.
Video Advertisement
ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లిన స్పందన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆమె హఠాన్మరణం ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి హీరో విజయ్ రాఘవేంద్ర బంధువు అవుతాడు.2007లో హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందన వివాహం జరిగింది. స్పందన బెంగళూరు మాజీ పోలీస్ ఆఫీసర్ బీకే శివరామ్ కుమార్తె. ఈ జంటకి కుమారుడు శౌర్య ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ పరిశ్రమలో భారీగా అభిమానులు ఉన్నారు. స్పందన 2016లో రిలీజ్ అయిన ‘అపూర్వ’ అనే కన్నడ చిత్రంతో పాటు పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా భర్త విజయ్ రాఘవేంద్ర సినిమాలకు నిర్మాతగా స్పందన పలు సినిమాలను సైతం నిర్మించింది.
రీసెంట్ గా ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లిన స్పందన ఈరోజు (సోమవారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆమెను హాస్పటల్ కి తరలించేలోపే స్పందన మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల 16వ వివాహ వార్షికోత్సవం రానుంది. ఈ లోపే స్పందన మరణించడం అందరినీ కలచివేస్తోంది. స్పందన భౌతికకాయం మంగళవారంలోగా బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణం తీవ్రంగా కలచివేస్తోందని విజయ్ రాఘవేంద్ర సన్నిహితులు సామాజిక మధ్యమలలో పోస్టులు పెడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిన విజయ్ రాఘవేంద్ర దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. 20కు పైగా సాంగ్స్ ను పాడారు. ప్రస్తుతం ఆయన పలు టెలివిజన్ షోలలోని డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!
End of Article