స్పెషల్ స్టోరీ: వాళ్ళ ఆలోచనకు కరోనా కొత్తమలుపు… ఇప్పుడు కోవిడ్‌ సైనికులయ్యారు.!

స్పెషల్ స్టోరీ: వాళ్ళ ఆలోచనకు కరోనా కొత్తమలుపు… ఇప్పుడు కోవిడ్‌ సైనికులయ్యారు.!

by Anudeep

Ads

ఒకప్పుడు టీచర్, డాక్టర్ , కలెక్టర్ ఇలా రకరకాల ఉద్యోగాలెంచుకునేవారు..తర్వాత కాలంలో అందరూ ఇంజనీరింగ్ – సాఫ్ట్ వేర్ అంటూ పరుగులుతీసారు. మరి ఇప్పుడో స్టార్టప్స్ దే హవా.. అవును మన ఆలోచనలే మన సంపాదన గా ముందుకు సాగుతున్నారు చాలామంది.. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఏదైనా డబ్బు సంపాదనే లక్ష్యం.. కొంతమంది కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగానే పని చేస్తే మరి కొంతమంది డబ్బుతో పాటు  తాము చేసే పని పదిమందికి ఉపయోగపడాలని కోరుకుంటారు..అటువంటి కోవకి చెందిన వారే శృతకీర్తి, భవ్య..

Video Advertisement

 

Image source sakshi

“ప్లాస్టిక్ రహిత సమాజం కావాలి అని కోరుకున్నప్పటికి.. నిత్యం ఏదో సందర్భంలో ప్లాస్టిక్ వాడాల్సిన దుస్తితి మనది..” హైదరాబాద్ కి చెందిన శృతకీర్తి , భవ్య ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించడంలో తమ వంతు భాగంగా  వ్యాపారం చేయాలనుకున్నారు.. అదేంటి అనుకుంటున్నారా? ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో నాన్ వోవన్ బ్యాగులను మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నారు..అది కూడా  ప్లాస్టిక్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ కంటే చవకైన ధరకే..

 

ప్లాన్ రెడీ, ఎక్విప్ మెంట్ రెడీ సాయంగా పనివాళ్లు కూడా రెడీ కానీ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం..లాక్ డౌన్ ప్రకటణ.. దాంతో వ్యాపారం చేయడం ఇప్పుడు సాధ్యంబకాదని, కొద్దిరోజులు ఆగాల్సిందే అని వెనక్కి తగ్గారు..ఇంతలో మార్కెట్లో మాస్కుల వ్యాపారం పుంజుకుంది.. ఒక్కో మాస్క్ ధర యాభై రూపాయల వరకు అమ్మి వినియోగదారులను విపరీతంగా దోచుకుంటున్నారు, సామాన్యుడికి మాస్కు అనేది దొరకని పరిస్థితి…అప్పుడు మైండ్లో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

 

 

మన దగ్గర మెటిరియల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది.. బ్యాగుల స్థానంలో మనం మాస్కులు ఎందుకు చేయకూడదు..అనే ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేసారు. మెషీన్స్ లో బ్యాగుల కోసం ఉన్న సెట్టింగ్స్ ని మాస్క్స్ తయారికి అనుగునంగా ఉండేలా మార్చి మాస్కులను తయారు చేసారు. అవే “త్రీ ఫ్లై మాస్కులు” అత్యాశకి పోకుండా కేవలం మెటిరియల్ ఖర్చు మాత్రమే ఛార్జ్ చేసి ఒక్కో మాస్కులని ఐదున్నర రూపాయలకి విక్రయిస్తున్నారు.

 

 

పేదవాళ్లకు మాస్కులు పంచే ఎన్‌జీవోలకు, దాతలకు నో ప్రాఫిట్‌ నో లాస్ కింద మాస్కులు చేసి ఇస్తున్నారు. కరోనా సైనికులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు  ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తాము చేసే పని సమాజానికి ఉపయోగపడాలి అనుకున్నాం కానీ, తొలి ప్రయత్నమే సమాజసేవతో మొదలు కావడం సంతోషంగా ఉంది అని ముక్తకంఠంతో అంటారు శృతకీర్తి, భవ్య.

 

 

నాన్ ఓవన్ మెటిరియల్  అంటే ఏంటి ? 

నాన్‌ వోవన్‌ అనే పదం కొత్తగా ఉండొచ్చు కాని ఆ మెటిరియల్ మనకు పరిచయం ఉన్నదే, మనం నిత్యం చూస్తూనే ఉంటాం. బేకరీల్లో క్యాప్‌లు, భవన నిర్మాణ రంగంలో కాళ్లకు కవర్‌లు, చేతులకు గ్లవుజ్‌లుగా వాడేది ఈ మెటిరియలే.. హాస్పిటల్‌లో వాడే పీపీఈ కిట్‌లు కూడా ఈ మెటీరియల్‌తోనే తయారవుతాయి. ఇప్పుడు ఈ మెటిరీయల్‌తో పీపీఈ కిట్‌లతోబాటు వైద్యప్రమాణాలకు అనుగుణంగా మాస్క్‌లు కూడా తయారు చేస్తున్నారు.

 

 

త్రీ ఫ్లై మాస్కులు  ఎలా పనిచేస్తాయి??

వైద్యప్రమాణాలైన నీటిలో నానకూడదు, నీరు పోసినా నీరు కారకూడదు, కాల్చినప్పుడు మంట రావాలి తప్ప పొగ రాకూడదు, మండేటప్పుడు గట్టిగా ఊదితే గాలికి మంట ఆరిపోకూడదు, మాస్క్ మెటిరియల్ పూరత్గా కాలిపోవాలి..ఈ వైద్యప్రమాణాలన్నింటికి అనుగుణంగా త్రీఫ్లై మాస్క్ ని తయారు చేసారు.  త్రీ ఫ్లై మాస్కులో మూడు పొరలుంటాయి. రెండువైపులా నీలం రంగు పొరల మధ్య తెల్లటి పొర ఉంటుంది. నాన్‌ వోవన్‌ మాస్కులు అలర్జీ కలిగించవు. గాలి హాయిగా ప్రసరిస్తుంది. ఈ మాస్క్‌ నీటిలో నానదు.


End of Article

You may also like